GET MORE DETAILS

దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు

దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు

                 



రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ ( APDASCAC ) మార్గదర్శకాలను విడుదల చేసింది.

అర్హతలు :

1. ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత నివాసి అయి ఉండాలి 2. 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులు.

3. కనీసం పదో తరగతి పాసవ్వాలి.

4. రూ.3లక్షలలోపు వార్షిక ఆదా యం ఉండాలి. 5. లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

6. వారికి సొంత వాహనం ఉండకూడదు.

7. గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు.

Note : గతంలో దరఖాస్తు చేసినప్ప టికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులే.

కావలసిన పత్రాలు :

1. జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం.

2. ఆధార్ కార్డు,

3. SSC ధ్రువపత్రం,

4. SC, ST అయితే కుల ధ్రువీకరణపత్రం,

5. దివ్యాం గుల పూర్తి ఫొటోను పాస్పోర్టు సైజులో ఉన్నది.

6. ఆదాయ ధ్రువీకరణ పత్రం (01-01-2022 తరువాత తీసుకొని ఉండాలి )

7. Banafide Certificate ( విద్యార్థి అయితే)

8. ముందుగా ఎటువంటి వాహనం తీసుకోలేదు. అని మరియు అన్ని వివరాలు సరిగా ఇస్తున్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్.

రిజర్వేషన్ :

మహిళలు - 50%

పురుషులు - 50%

SC-16%

ST -7%

General - 77%

Note : SC & ST మరియు మహిళల & పురుషుల లో ఒకరికి రిజర్వేషన్ తగిన దరఖాస్తు రానిచో మరొకరికి వారికి ఇవ్వటం జరుగును.

ప్రాధాన్యత :

1. PG విద్యార్థులు

2. Self/Wage/Salary పొందుతు డిగ్రీ చేసిన వారికి

చివరి తేదీ :

ఆన్లైన్ ద్వారా అక్టోబర్ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.


Post a Comment

0 Comments