GET MORE DETAILS

'రిప్' అంటే అర్థం ఏంటి ? ఎందుకు ఎక్కడ వాడాలి. ప్రొఫెసర్ మొగిలి రేవతి గౌడ్ గారి ప్రత్యేక కథనం.

'రిప్' అంటే అర్థం ఏంటి ? ఎందుకు ఎక్కడ వాడాలి. ప్రొఫెసర్ మొగిలి రేవతి గౌడ్ గారి ప్రత్యేక కథనం.



తెలుసుకోకుండానే 'రిప్' అని పెట్టడం ఒక ఆచారంగా మారిపోయింది. ఉపయోగించాలి. కాని ఎవరి ఈ పదాన్ని ఎవరు కోసం ఉపయోగించాలో, అసలు ఎవరిదైన మరణ వార్త విన్నప్పుడు 'రిప్' అనే పదం వాడటం మన సంస్కృతి లో లేదు. పాశ్చాత్య మతాలైన క్రైస్తవం, ఇస్లాం ఆచారల నుంచి పుట్టింది. హిందూధర్మం గురించి మరిచిపోవడం వల్ల జనాలకు ఈ పదం వాడుక దాని అర్థం మీద అవగాహన లేకుండా పోయింది.

'రిప్' అనే పదానికి అర్థం "Rest in Peace" (శాంతిగా శయనించి శాశ్వత నిద్రను పొందు ) ఈ పదం కేవలం ఎవరినైతే గొయ్యి తవ్వి పాతిపెడతారో వాళ్ళ కోసం మాత్రమే వాడాలి అంటే ముస్లిం లేదా క్రైస్తవులు మరణించినప్పుడు ఈ పదం వాడొచ్చు. ఎందుకంటే వారి ఆచారం. ప్రకారం వారు మరణానంతరం ఆ వ్యక్తిని పాతిపెట్టి పడుకోమని చెప్పి ఎప్పుడైనా "జడ్జిమెంట్ డే " లేదా "కయామత్ కే దిన్" వచ్చినప్పు డు ఈ శవాలన్నీ పునర్జీవులౌతాయని వారు నమ్ముతారు. అంటే అప్పటి వరకు విశ్రాంతిగా శయనించమని RIP అని రాస్తారు లేదా కోరుకుంటారు. కానీ హిందూ ధర్మం సాంప్రదాయాల శరీరం భౌతికమైనది, ఆత్మ ప్రకారం అమరమైనది. అందుకే హిందూ ధర్మంలో మరణించిన వ్యక్తిని కట్టెలు నెయ్యితో యథాశక్తి కాలుస్తారు. అంటే ఒక హిందూ చనిపోతే 'రిప్' (Rest in Peace) అని రాయడంలో అర్థమే లేదు. హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి ఆత్మ వేరొక దేహంలోకి వెళు తుందని పునర్జీవం పొందుతుందని నమ్ముతారు. ఆ ఆత్మకు కొత్త దిశ/సద్గతి ప్రాప్తించాలనే శ్రాద్ధకర్మలు శాంతిపాఠాలు చేస్తారు.

అంటే హిందూ ఎవరైనా మరణిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరాలని లేదా వినమ్ర శ్రద్ధాంజలి లేదా శ్రద్ధాంజలి అని మాత్రమే రాయాలి. ఫాషన్ కోసమో స్టైల్ గా ఉంటుందనో లేదా తెలియకుండానో లేదా గుంపులో మంద లాగా 'రిప్' అని రాయకూడదు. అదే క్రైస్తవం లేదా ముస్లింలు మరణించినప్పుడు 'రిప్' అని రాయవచ్చు.

ఈ మధ్య శ్రద్ధాంజలి అని రాయడానికి కూడా బద్దకించి షార్ట్కట్ లు వెతుక్కుంటున్నాం. ఆ క్రమంలోనే ఈ 'రిప్' మనకు అంటుకుంది. అవివేకంతో ఒకరు చేసారని దానినే గుడ్డిగా ఫాలో అవుతున్నాం. ఈ విషయం ఎవరినీ ఉద్దేశించినది కాదు కేవలం వాస్తవాలు తెలియచెప్పడం కోసమే. అందుకే ఇప్పటికైనా భవిష్య త్తులో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారని ఈ విషయం తెలియని చాలామందికి తెలియపరుస్తారని. కోరుకుంటున్నాం.

Post a Comment

0 Comments