మన ఆరోగ్యం - ఉడికించిన వేరుశనగల్లో దాగున్న అమేజింగ్ హెల్త్ సీక్రెట్స్
● రోడ్లపై ఎక్కడ చూసినా ఘుమఘుమ సువాసనలతో.. ఉడికించిన వేరుశనగలు కనిపిస్తూ ఉంటాయి.
● పల్లెటూర్లలో అయితే వేరశనగ పంట చేతికి వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో వీటిని ఉడికించి స్నాక్స్ గా తింటూ ఉంటారు.
● మీరూ వేరుశనగ పప్పును ఇష్టపడతారా ? ఉడికించిన వేరుశనగలు చూస్తే చాలు తినేస్తారా ?
● అయితే ఈ అలవాటు మంచిదే. వేరుశనగలను పచ్చిగా తినడం కంటే కాస్త ఉప్పు వేసి ఉడికించి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
● మరి ఉడికించిన వేరుశనగల్లో దాగున్న అమేజింగ్ హెల్త్ సీక్రెట్స్ తెలుసుకుందామా..
● తక్కువ క్యాలరీలు డ్రైఫ్రూట్స్ తో సమానంగా వేరుశనగ గింజల్లో పోషకాలుంటాయి. అయితే ఉడికించిన వేరుశనగల్లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయట.
● ఒక కప్పు ఉడికించిన వేరుశనగల్లో 90 క్యాలరీలుంటాయి. అదే వేయించిన డ్రై వేరుశనగల్లో అయితే 166క్యాలరీలుంటాయి.
● కాబట్టి ఉడికించిన వేరుశనగ గింజలు తినడం వల్ల బరువు కంట్రోల్ లో ఉంటుంది. ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్ ఉడికించిన వేరుశనగల్లో ఫ్లేవనాయిడ్స్,
● పాలిఫెనాల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి.
● దీనివల్ల క్యాన్సర్, హార్ట్ డిసీజ్, డయాబెటిస్ వంటి వ్యాధుల రిస్క్ ని తగ్గిస్తాయి. ఫైబర్ ఉడికించిన వేరుశనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
● ఒక కప్పు ఉడికించిన వేరుశనగ గింజల్లో 2.5గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఉడికించిన వేరుశనగలు తీసుకోవడం వల్ల..
● కాన్ట్సిపేషన్ అరికట్టవచ్చు, ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. అలాగే హార్ట్ డిసీజ్, డయాబెటిస్ రిస్క్ ని తగ్గిస్తుంది.
● గుండె ఆరోగ్యానికి ఉడికించిన వేరుశనగల్లో ఉండే ఫ్యాట్ అంతా గుండె ఆరోగ్యానికి సహాయపడే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్. డైట్ లో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్ చేర్చుకోవడం
● వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎనర్జీ అరకప్పు ఉడికించిన వేరుశగన గింజల్లో 12గ్రాముల ప్రొటీన్, 2 గ్రాముల న్యాచురల్ షుగర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదు. మధ్యాహ్నం భోజనం,
● రాత్రి భోజనానికి మధ్యలో ఉడికించిన వేరుశనగలు తింటే.. కావాల్సినన్ని పోషకాలు అందడమే కాకుండా.. మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతాయి.
● బ్రెయిన్, కండరాలు ఉడికించిన వేరుశగనలు స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల.. మెదడు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
● మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి.
● విటమిన్స్ ఉడికించిన వేరుశనగల ద్వారా విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది.
● అవయవాల డెవలప్ మెంట్ లో కీలకపాత్రపోషించే బి కాంప్లెక్స్ విటమిన్స్ ని పొందవచ్చు. బి విటమిన్స్ శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడటానికి సహాయపడతాయి.
● ఎముకలు, నరాలకు అరకప్పు ఉడికించిన వేరుశగనల్లో 30 శాతం మెగ్నీషియం ఉంటుంది. ఇందులో ఉండే మినరల్స్ ఎముకలు, పళ్లకు మంచిది.
● అలాగే మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరుకి సహాయపడతాయి. అలాగే ఆహారాన్ని ఎనర్జీగా మారుస్తాయి.
0 Comments