GET MORE DETAILS

గూగుల్‌ క్రోమ్‌ సేఫ్‌ కాదు - అట్లాస్‌ వీపీఎన్‌ నివేదిక

గూగుల్‌ క్రోమ్‌ సేఫ్‌ కాదు - అట్లాస్‌ వీపీఎన్‌ నివేదిక



నెట్‌సర్ఫింగ్‌ అనగానే గూగుల్‌ క్రోమ్‌ తప్ప మరోటి లేదన్నట్టుగా తయారైంది పరిస్థితి. కానీ ఆ బ్రౌజర్‌ అత్యంత అసురక్షితమైనదని తాజా సర్వేలో వెల్లడైంది. అట్లాస్‌ వీపీఎన్‌ సరికొత్త నివేదికలో 303 భద్రతా సమస్యలను నివేదించింది. గత జనవరి 1 నుంచి అక్టోబర్‌ 5 వరకు బైటపడిన లోపాలివి. దీంతో మొత్తంగా క్రోమ్‌ భద్రతా సమస్యల సంఖ్య 3,159కి చేరింది. బ్రౌజర్‌లకు సంబంధించి ఇదే అత్యధికం కావడం గమనార్హం. అక్టోబర్‌ నెల మొదటి 5 రోజుల్లోనే 5 లోపాలు బయటపడ్డాయట.

అయితే వాటి వివరాలను వీపీఎన్‌ వెల్లడించలేదు. గూగుల్‌ క్రోమ్‌ వెర్షన్‌ 106.0.5249.61. కు అప్‌గ్రేడ్‌ అయితే ఈ భద్రతా సమస్యల నుంచి విముక్తం కావచ్చని తెలిపింది. భద్రతా సమస్యల్లో గూగుల్‌ క్రోమ్‌ తర్వాతి స్థానాన్ని పైర్‌ఫాక్స్‌ ఆక్రమించింది. సాపేక్షంగా మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, సఫారీ కింది స్థానాల్లో ఉన్నాయి. జనం పెద్దగా వాడని ఓపేరా బ్రౌజర్‌లో మాత్రం భద్రతా లోపాలు అసలే లేవట.

Post a Comment

0 Comments