GET MORE DETAILS

చేదు బుడమ కాయలు - రూపాయి ఖర్చు లేని ఈ కాయలు తింటే ఈ ఆరోగ్య సమస్యలు పరారు

చేదు బుడమ కాయలు - రూపాయి ఖర్చు లేని ఈ కాయలు తింటే ఈ ఆరోగ్య సమస్యలు పరారు



బుడమ కాయల చెట్టు వానాకాలంలో ఈ తీగ జాతి మొక్క విరివిగా పెరుగుతుంది.. ఈ కాయలను చేదు బుడమ కాయలు, అడవి బుడమ కాయలు అని పిలుస్తారు.. ఈ కాయలను ఖర్చు చేసి కొనవసరం లేదు.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. ఈ మొక్క, పువ్వులు, కాయలు, వేర్లు అంతా పోషకాల మయం. ఈ కాయలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!!

ఈ ఆకులను కాల్చి బూడిద చేసి ఆ పొడిని పలకపై తయారవుతుంది. బట్టతలపై జుట్టు మొలిపిస్తుంది. ఈ చెట్టు ఆకుల రసాన్ని తీసి ఆ రసాన్ని తల పై రాస్తే కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. ఈ చెట్టు కాయలను చూస్తుంటే చిన్న చిన్న పుచ్చకాయలు లాగా ఉంటాయి. ఈ కాయలు చక్కటి వాసనను కలిగి ఉంటాయి. ఈ కాయలను పచ్చిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది కేవలం 20 గ్రాముల కేలరీలు మాత్రమే లభిస్తాయి. వీటిని కూర గా వండుకుని కూడా తినవచ్చు.

ఈ కాయలలో విటమిన్ ఏ, బి తో పాటు ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. మలబద్ధకం నివారిస్తాయి. కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. గ్యాస్ అసిడిటీ అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. పని తగ్గిస్తుంది శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. రక్త ప్రసరణకు అడ్డుపడే కొలెస్ట్రాల్ ను కరిగించి సక్రమంగా రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. రక్త హీనతతో బాధ పడుతున్న వారు ఈ కాయలు తింటే రక్తం వృద్ధి చెందుతుంది. ఈ కాయలు తినడం వలన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇలా రక్తాన్ని శుద్ధి చేయడం వలన చర్మ సంబంధిత సమస్య రావు. బుడమ కాయ రసం ఒక స్పూన్ తీసుకుని అందులో ఒక చెంచా తేనె కలిపి ప్రతి రోజూ తాగుతూ ఉంటే స్కిన్ ఎలర్జీ చర్మ సమస్యలు రావు.

Post a Comment

0 Comments