GET MORE DETAILS

దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎం హైదరాబాద్‌లో ప్రారంభం - ఎప్పుడంటే అప్పుడే డ్రా చేసుకోవచ్చు బంగారం

దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎం హైదరాబాద్‌లో ప్రారంభం - ఎప్పుడంటే అప్పుడే డ్రా చేసుకోవచ్చు బంగారం
          


దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను శనివారం హైదరాబాద్‌ బేగంపేటలో ప్రారంభించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు. అశోక్‌ రఘుపతి ఛాంబర్స్‌లోని గోల్డ్‌ సిక్కా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్‌ ఏటీఎం ఒక ఉదాహరణని ఆమె అభివర్ణించారు. ఈ ఏటీఎం ద్వారా 99.99శాతం శుద్ధత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్‌ తరుజ్‌ తెలిపారు. బంగారు నాణేలతోపాటు వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలూ జారీ అవుతాయని వెల్లడించారు. త్వరలో నగరంలోని గుల్జార్‌హౌస్‌, సికింద్రాబాద్‌, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, వరంగల్‌, కరీంనగర్‌లలో గోల్డ్‌ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్‌పై కనిపిస్తాయని వెల్లడించారు.

Post a Comment

0 Comments