GET MORE DETAILS

హిమాలయన్ గోల్డ్ - ఇప్పుడు చైనా సైనికుల కళ్ళు దీనిపై పడ్డాయని సమాచారం.

 హిమాలయన్ గోల్డ్  - ఇప్పుడు చైనా సైనికుల కళ్ళు దీనిపై పడ్డాయని సమాచారం. 




ఈ మధ్యనే పలుమార్లు చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్లో చొరబడ్డారు. అనేక సార్లు భారత భూభాగంలోకి వారు ఎందుకు వస్తున్నారు అనే అంశంపై ఇండో పసిఫిక్ ఫర్ స్ట్రాటెజిక్ కమ్యూనికేషన్ సంస్థ ఓ నివేదికను ఇచ్చింది.

ఇందులో ఎంతో విలువైన ‘కీడా జోడి’ కోసం చైనా సైనికులు ఇలా చొరబడుతున్నట్టు తేలింది. వాటిని అమ్ముకుంటే లక్షల్లో డబ్బులు వస్తాయి. ఇంకా చెప్పాలంటే బంగారం కన్నా ఎంతో విలువైనవి ఇవి. అందుకే వాటిని ఏరి పట్టుకెళ్లేందుకు చైనా సైనికులు వస్తున్నారట. వీటిని ‘హిమాలయన్ వయాగ్రా’ అని కూడా పిలుస్తారు. లైంగిక సమస్యలను ఇది చాలా సమర్ధంగా ఎదుర్కొంటుంది. 

ఏమిటివి...?

కీడా జోడి... హిమాలయా ప్రాంతాల్లో పెరిగే ఓ రకమైన ఫంగస్. వీటిని హిమాలయన్ గోల్డ్ అని పిలుస్తారు. ఇవి పుట్టగొడుగుల వర్గానికి చెందినవని చెప్పుకుంటారు, చూడటానికి మాత్రం గొంగళి పురుగుల్లా ఉంటాయి. ఇవి కిలో దొరికాయంటే లక్షాధికారి అయిపోవచ్చు. కిలో 20 నుంచి 25 లక్షలు ఉంటాయి. ముఖ్యంగా విదేశాల్లో వీటికి చాలా డిమాండ్. ప్రపంచంలో అత్యంత అరుదైన శిలీంధ్ర జాతుల్లో ఇవీ ఒకటి. 

ఎందుకంత ఖరీదు...?

వీటిలో ఉండే శక్తివంతమైన ఔషధ గుణాలు.

Post a Comment

0 Comments