GET MORE DETAILS

ప్రపంచంపై చెరగని ముద్ర (నేడు జాన్ గుటెన్‌బర్గ్ జయంతి)

 ప్రపంచంపై చెరగని ముద్ర (నేడు జాన్ గుటెన్‌బర్గ్  జయంతి)



యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836


ముద్రణా యంత్రాన్ని కనుగొనక ముందు కవులు తాళపత్రాల ద్వారా  తమ రచనలని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. రాజుల తమ ఘన కార్యాలని శాసనాలలో పొందుపర్చేవారు. చరిత్రకు ఇవే ఆధారాలుగా నిలిచాయి.

ముద్రణా యంత్రాన్ని కనుగున్న గ్యూటెన్ బర్గ్  ఒక సంపన్న కుటుంబలో జన్మించారు. చిన్నతనంలోనే స్త్రాన్ బర్గ్ కి వెళ్ళి కొయ్య దిమ్మలతో ముద్రించటం చేర్చుకున్నారు.

అద్దాలకు మెరుగుపెట్టడం, రత్నాలకు సానపెట్టడం కూడా కొన్నాళ్ళూ చేశాడు. ఈ హస్త కళల్లో అనేక కొత్త పద్ధతులను కనిపెట్టారు. 

అక్షరాల అచ్చులను విడిగా తయారుచేసి వాటిని పదాలుగా, వాక్యాలుగా కూర్చే ఆలోచన స్ట్రాన్ బర్గ్ లోవున్నప్పుడె అతనికి తట్టినట్టు తెలుస్తోంది.50 యేళ్ళ వయసులో అతడు తన జన్మస్థానానికి తితిగి వచ్చి ముద్రణ ఆలోచనల్ని ఆచరణలో పెట్ట సాగారు. ఒక్కొక్క అక్షరానికి ఒక అచ్చును తయారుచేసి, వీటి నుంచి ఒకే పరిమాణంలో ఉండే లోహపు అచ్చుల్ని తీర్చి దిద్దారు. 

అప్పట్లో చేతితో రాయబడే అక్షరాలు కేవలం అలంకార ప్రాయంగా వున్నాయన్న కారణంతో ముద్రణకు సరిపోయేలా అక్షరాల తీరులో సరిక్రొత్త మార్పులు చేశారు. 

అక్షరాలను కచ్చితంగా ఏర్పరిచే అచ్చులను తయారుచేసే సాధనాన్ని కూడా అతడే కనుగొన్నారు. 

అచ్చులన్నిటికీ ఒకే పరిమాణంలో సిరా పూయటానికి మరో సాధనాన్ని, కావససినంత ఒత్తిడిని మాత్రమే కలగజేసే ప్రెస్సింగ్ యంత్రాన్నీ తయారుచేశాకనే అతడు ముద్రణకు పూనుకున్నారు. వీటి నిర్మాణానికి ఆయన చాలా శ్రమ పడ్డారు.

తొలిసారిగా అతడు ఒక పాత జర్మన్ పద్యాన్ని ముద్రించి చూశారు. ఇది తృప్తికరంగా వుండటంతో లాటిన్ భాషలో బైబిల్ మొత్తాన్ని ముద్రించటానికి సాహసించారు.

 ఒక పేజీకి 42 గీతలు చొప్పున 1282 పేజీలు గల ఆ గ్రంథాన్ని సరైన సదుపాయాలు లేని చిన్న సంష్త ముద్రించటానికి పూనుకోవటం నిజంగా సాహసమే!అనేక సంవత్సరాలు శ్రమించి అతడీ బృహత్కార్యాన్ని 1456 లో పూర్తి చేశారు.

పని పూర్తయ్యే సరికి అతనివద్ద చిల్లిగవ్వ కూడా మిగలలేదు.ఇంతవరకు డబ్బు సమకూరుస్తూ వచ్చిన అతని భాగస్వామి తన వాటా వెంటనే యిచ్చివేయమని పట్టు బట్టారు. 

గత్యంతరం లేక ఇంటినీ, వర్క్ షాప్ నీ, ముద్రించిన ప్రతులనూ గ్యూటెన్ బర్గ్ వదిలి వెళ్ళాల్సి వచ్చింది. అతని శేష జీవితం ఎలా గడిచిందో తెలియదు.

ముద్రణా యంత్రాన్ని కనుగున్న గూటెన్ బర్గ్ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు.గుటెన్‌బర్గ్ యొక్క ఆవిష్కరణ సాంస్కృతిక మరియు సామాజిక విషయాలపై తదుపరి మానవ చరిత్రపై అపారమైన ప్రభావాన్ని చూపింది . అతని డిజైన్ ఐరోపా అంతటా పుస్తకాల విస్తృత వ్యాప్తిని ప్రత్యక్షంగా ప్రభావితం చేసింది, సమాచార విప్లవానికి కారణమైంది . ఫలితంగా, గుటెన్‌బర్గ్ ప్రభావం లేకుండా పునరుజ్జీవనం , సంస్కరణ మరియు మానవతావాద ఉద్యమం యొక్క ప్రారంభోత్సవాన్ని వెంజ్కే "అనూహ్యమైనది"గా వర్ణించారు.  "ప్రపంచంలోని అత్యంత గుర్తింపు పొందిన పేర్లలో ఒకటి"గా వర్ణించబడింది.



Post a Comment

0 Comments