GET MORE DETAILS

గుండెపోటుకు ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తగా గమనించండి

గుండెపోటుకు ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తగా గమనించండి



ప్రస్తుతం హార్ట్ పేషెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న వయసు వారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే గుండెపోటు లక్షణాలను తెలుసుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చంటున్నారు నిపుణులు.

ఆడ, మగ అంటే తేడా లేకుండా అన్ని వయసుల వారు గుండె జబ్బులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల మంది గుండెజబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారని.. మృతుల్లో ఐదో వంతు మంది భారత్ కు చెందిన వారేనని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హృదయ సంబంధ వ్యాధులకు, గుండె రక్త నాళాలు దెబ్బతినడానికి, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అధిక రక్తపోటు, గుండెపోటు, అరిథ్మియా వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ వ్యాధులు ప్రాణాలను ఇట్టే తీసేయగలవు. వీటి పట్ల చాలా శ్రద్ధ అవసరం. గుండె జబ్బులకు వీలైనంత తొందరగా చికిత్స తీసుకోవాలి. ఇందుకోసం ముందుగా గుండెపోటు లక్షణాలను తెలుసుకోవాలి.

హెచ్చరిక సంకేతాలు :

గుండెపోటుకు ప్రారంభ లక్షణాలు ఉంటాయి. ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, చేయి లేదా భుజం నొప్పి, బలహీనత వంటివి లక్షణాలు కనిపిస్తాయి. గుండెపోటుకు రోజులు, వారాలు లేదా గంటల ముందు కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. మెడ దృఢత్వం, భుజం నొప్పి, అజీర్ణం, అలసట, చల్లని చెమటలు, ఆందోళన, గుండె దడ, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు హెచ్చరిక సంకేతాలు. ఇవి మీ పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్తాయి.

మీరు గమనించాల్సిన ఇంకా కొన్ని లక్షణాలు: గుండె జబ్బుల లక్షణాలు పురుషులు, మహిళల ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. కానీ శారీరక తేడాల కారణంగా.. కొన్ని లక్షణాలు మారొచ్చు.

గుండెపోటు పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ప్రాణాంతకం. స్ట్రోక్ లేదా గుండెపోటు తర్వాత ఆడవారు అంత సులువుగా కోలుకోరు.

రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఫలకం ఏర్పడటం వల్ల గుండెపోటు వస్తుంది. మహిళలతో పోలిస్తే పురుషులకే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

పురుషులకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటే.. ఆడవారికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పీసీఓడీ, డయాబెటిస్, గర్భం, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

గుండెపోటుకు ముందు పురుషులకు ఛాతీలో నొప్పి, చెమట, అజీర్ణం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే స్త్రీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దవడ నొప్పి, వెనుక భాగంలో నొప్పి, అలసట, నిద్రపట్టకపోవడం వంటివి అసాధారణ లక్షణాలను అనుభవించొచ్చు.

స్మోకింగ్ వల్ల పురుషులు, మహిళలకు గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కానీ స్మోకింగ్ చేసే మగవారికంటే స్మోకింగ్ చేసే ఆడవారికే గుండెపోటు ముందుగా వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments