GET MORE DETAILS

మిషన్ వాత్సల్యకు దరఖాస్తులు చేసుకోండి.

 మిషన్ వాత్సల్యకు దరఖాస్తులు చేసుకోండి.



తల్లిదండ్రులు లేని ఎటువంటి ఆధారం లేకుండా ఒంటరిగా ఉంటున్నా 18సంవత్సరాలు లోపు బాల బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ వాత్సల్య ప్రోగ్రామ్ కు అర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవాలని. ఇందుకు సంబందించి మార్గదర్శకాలు 18 సంవత్సరాలలోపు తల్లి లేదా తండ్రి లేని చిన్న పిల్లలు వివరాలు మీ సమీపంలో వున్న అంగన్వాడీ టీచర్కు అందచేస్తే వారికి కేంద్ర ప్రభుత్వం నెలకి రూ 4000/- వరకు డబ్బులు ఇస్తుందని దరఖాస్తుకు కావలసిన పత్రాలు తల్లి లేదా తండ్రి చనిపోతే డెత్ సర్టిఫికెట్టు,తల్లిదండ్రి విడాకులు/విడిగా వున్నట్లుయితే స్థానిక వి.ఆర్.ఓ. లెటర్,తల్లి, తండ్రి, బిడ్డ ఆధార్ కార్డులు,బిడ్డ పుట్టిన తేదీ సర్టిఫికెట్టు,గార్డియన్ అనగా తల్లి గాని తండ్రి గాని ఎవరు ఉంటే వాళ్ళతో బిడ్డకు జాయింట్ బ్యాంక్ అకౌంట్ లేదా బిడ్డ పేరున అకౌంట్ వున్నా పరవాలేదు,ఇద్దరు పిల్లలైతే రెండు బ్యాంక్ అకౌంట్లు ఉండాలని మరిన్ని వివరాలకు గ్రామ పట్టణ స్థాయి లో అంగన్వాడీ గ్రామ పట్టణ సచివాలయంలలో సంప్రదించి దరఖాస్తులు పొంది సకాలంలో పూర్తిచేసి సచివాలయా కార్యాలయంలో అందజేయాలి.

Post a Comment

0 Comments