GET MORE DETAILS

కొత్తగా వచ్చిన ఆధార్‌ అప్డేషన్‌ అంశంపై సందేహాలు - సమాధానాలు

కొత్తగా వచ్చిన ఆధార్‌ అప్డేషన్‌ అంశంపై సందేహాలు - సమాధానాలు



Q: ఆధార్ అప్డేట్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకేనా లేక దేశంలో అందరికీ ఉందా ?

A: సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఆధార్‌లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.


Q: కొత్తగా ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎందుకు ?

A: 2010 నుంచి 2016 వరకు ఆధార్ ఇచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఆధార్‌ ఇవ్వబడింది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న బోగస్ ఆధార్ కార్డులను ఏరివేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఆధార్ ఉన్న పౌరుడు వారి పేరు & అడ్రస్‌ను సరైన ఆధారాలతో ధృవీకరించుకోవాలి.


Q: డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి ?

A: 2010 నుంచి 2016 మధ్యలో ఆధార్ తీసుకుని 2016 తర్వాత ఆధార్‌లో పేరు గానీ అడ్రస్ గానీ మార్చుకోకపోతే వాళ్లు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.


Q: 2016 తర్వాత  నేను నా ఫోటో & డేట్ అఫ్ బర్త్‌ను మార్చుకున్నాను. ఇప్పుడు నేను మరలా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలినా ?

A: 2016 తర్వాత పేరు అడ్రస్ మార్చుకోలేదు కాబట్టి మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవాల్సిందే.


 Q: డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది ?

 A: డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోని వారందరి ఆధార్‌లు 2023 ఆగస్టు తర్వాత సస్పెండ్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


Q: ఆధార్ సస్పెండ్ అయితే ఏమవుతుంది ?

A: ఆధార్ సస్పెండ్ అయితే ఆధార్‌తో లింక్ అయిన అన్ని సర్వీసులూ నిలిచిపోతాయి. అనగా బ్యాంకింగ్, పోస్టల్, గ్యాస్ వంటి అన్నిరకాల సేవలూ ఆగిపోతాయి. స్టేట్ & సెంట్రల్  గవర్నమెంట్  రెండింటి నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్ని ఆధార్‌తో సంబంధించినవే గనుక అన్ని పథకాలు వర్తించకుండా పోతాయి.


Q: నా ఆధార్‌లో ఉన్న అడ్రస్, ఇప్పుడు నేను ఉంటున్న అడ్రస్ రెండూ వేరు వేరు.. ఇప్పుడు నేనేం చేయాలి ?

A: సరైన ఆధారాలతో మీ అడ్రస్‌ను అప్డేట్ చేయించుకోవాలి.


Q: ఇప్పుడు నేను అడ్రస్ అప్డేట్ చేసుకుంటే మరలా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలా ?

A: అవసరం లేదు.


Q: నా ఆధార్ మా అమ్మవాళ్ల ఇంటి పేరుతో ఉంది. నాకు పెళ్లయిన తర్వాత మా అత్తగారింటి పేరుతో ఆధార్ కావాలి. ఇప్పుడు నేను పేరు మార్చుకోవాలంటే ఎలాంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి ?

A: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికెట్‌తో మీ ఇంటి పేరు(ఒకవేళ పేరు మార్చుకున్నట్టయితే దాన్ని కూడా) మార్చుకోవచ్చు.


Q: డాక్యుమెంట్ అప్డేట్‌కు ఎంత ఛార్జ్ అవుతుంది ?

A: 50 రూపాయలు

Post a Comment

0 Comments