GET MORE DETAILS

EPFO: ఈ నంబర్‌కు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. పీఎఫ్ బ్యాలెన్స్ క్షణాల్లో ఫోన్‌కు మెసేజ్. ఇప్పుడే ట్రై చేయండి.

 EPFO: ఈ నంబర్‌కు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. పీఎఫ్ బ్యాలెన్స్ క్షణాల్లో ఫోన్‌కు మెసేజ్. ఇప్పుడే ట్రై చేయండి.



EPFO: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) అకౌంట్ ఉంటుంది. అయితే ప్రతి నెలా పీఎఫ్ నగదు అకౌంట్‌లో జమ అవుతుందా? పీఎఫ్ అకౌంట్‌లో ఇప్పుడు ఎంత నగదు ఉంది.. మీ కంపెనీ ఎంత వేస్తుంది అని చెక్ చేసుకుంటున్నారా? ఇప్పుడు ఒక్క నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ క్షణాల్లో ఫోన్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. అనేది భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఒక సామాజిక భద్రతా సంస్థ. దీనిని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అంటారు. ఉద్యోగం చేసే అందరికీ ఈపీఎఫ్‌ఓ అకౌంట్ ఉంటుంది. ఇందులో భాగంగా కంపెనీలు మీ వేతనంలో నుంచి సుమారు 12 శాతం వరకు పీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తుంటుంది. దీనికి సదరు సంస్థ అంతే మొత్తం యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం దీనికి వడ్డీ జమ చేస్తుంటుంది. ఈ వడ్డీ రేటును ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒకసారి సవరిస్తుంటుంది. ఇటీవల పీఎఫ్ వడ్డీ రేటును 8.10 శాతం నుంచి 8.15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ పీఎఫ్ ఖాతాతో అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం సహా.. అందులో చివరగా యాడ్ అయిన అమౌంట్ వంటివి తెలుసుకోవచ్చు. దీని కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చాలా ఆప్షన్లే అందుబాటులో ఉన్నాయి.


Missed Call ద్వారా...

పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకునే వారు కేవలం ఒక్క నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌‌కు పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో మెసేజ్ వస్తుంది. ఆ నంబర్ 9966044425. పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు ఉన్న సులభ మార్గాల్లో ఇదొకటి. ఇందులో చివరిగా మీ పీఎఫ్ ఖాతాలో జమ అయిన అమౌంట్‌తో పాటు మొత్తం బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా తెలుస్తుంది.

ఇందుకోసం మీ UAN యాక్టివ్‌లో ఉండాలి. అకౌంట్ హోల్డర్ మొబైల్ నంబర్ .. UANతో రిజిస్టరై ఉండాలి. ఆధార్, పాన్ కార్డు లేదా బ్యాంక్ అకౌంట్‌తో UAN సీడింగ్ పూర్తి చేయాలి.


SMS ద్వారా...

ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. EPFOHO UAN అని 7738299899 నంబర్‌కు మెసేజ్ చేయాలి. ఇక్కడ UAN అంటే నంబర్ ఎంటర్ చేయాలి.


UMANG APP ద్వారా...

భారత ప్రభుత్వ యాప్ ఉమంగ్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం UAN, OTP తో లాగిన్ కావాల్సి ఉంటుంది. తొలుత ఉమంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని.. మొబైల్ నంబర్ వెరిఫికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ All Services ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత EPFO ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేసి బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.


ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ ద్వారా...

EPFO అధికారిక వెబ్‌సైట్ www.epfindia.gov.in ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు పొందొచ్చు. ఈ వెబ్‌సైట్లోకి వెళ్లి Our Services ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత For Employees ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మెంబర్ పాస్‌బుక్‌ను ఎంచుకోవాలి. తర్వాత UAN, PASSWORD ద్వారా లాగినై.. వివరాలు తెలుసుకోవచ్చు.

Post a Comment

0 Comments