GET MORE DETAILS

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష : హాజరు కానున్న 50,646 మంది అభ్యర్థులు

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష : హాజరు కానున్న 50,646 మంది అభ్యర్థులు



యూనియ న్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ (Civils Preliminary) పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగనుంది. మొదటి సెషన్‌ ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జనరల్‌ స్టడీస్‌ పేపర్‌, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీ-శాట్‌ (C-SAT) ఎగ్జామ్‌ నిర్వహించన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50,646 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. వీరికోసం హైదరాబాద్‌ (Hyderabad) జిల్లాలో 99 పరీక్షా కేంద్రాలను, వరంగల్‌ (Warangal) నగరంలో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 45,611 మంది పరీక్ష రాయనుండగా, వరంగల్‌లో 5,035 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

పరీక్ష నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గంట ముందునుంచే ఎగ్జామ్‌ హాల్‌లోకి అనుమతించనున్నారు.

Post a Comment

0 Comments