GET MORE DETAILS

రణపాల ఆకులు - వాటి వలన ఉపయోగాలు

 రణపాల ఆకులు - వాటి వలన ఉపయోగాలు



ఈ మొక్క సాంకేతిక నామం బ్రయోఫిల్లం రణపాల ఆకు కాస్త దళసరిగా ఉండి రుచిలో వగరు, కాస్త పులుపు గా ఉంటుంది. ఆకు చుట్టూ డిజైన్ లాగా (మందార ఆకులాగా) ఉంటుంది.

ఈ మొక్క ఆకు ద్వారానే తిరిగి ప్రత్యుత్పత్తి కొనసాగిస్తుంది. అనగా ఆకు నాటడం ద్వారా తిరిగి మొక్క మొలుస్తుంది.

ఈ రణపాల ఆకులను నేరుగా తినవచ్చు, సలాడ్లలో కలుపు కుని తినవచ్చు, లేక కషాయం తయారు చేసుకుని తాగవచ్చు. ఈ రణపాల ఆకు ఉదయం రెండు రాత్రి రెండు ఆకులు తినడం ద్వారా కిడ్నీలో, గాల్ బ్లాడర్ లో ఏర్పడ్డరాళ్ళు కరిగి బయటకు పోతాయి. ఈ ఆకు తినడం వలన రక్తంలో క్రియాటిన్ తగ్గి డయాలసిస్ రోగులకు మూత్రపిండాల పని తీరు మెరుగుపడుతుంది.

మధుమేహంకూడ కాస్తఅదుపు లో ఉంటుంది ఆకు తినడం వలన కడుపులో అల్సర్లు తగ్గుతాయి. తద్వారా అజీర్తి, మలబద్దకం తగ్గతాయి. కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయని అంటారు. ఈ ఆకు తినడం వలన జలుబు, దగ్గు, విరేచనా లను నయం అవుతాయి. ఈ ఆకులో యాంటీపైరేటిక్ గుణం ఉండటం వలన మలేరియా టైఫాయిడ్ లను తగ్గిస్తుంది.

ఈ ఆకు డియూరిటిక్ లక్షణం కలిగి ఉండటం వలన మూత్రం లో రక్తం, చీము వంటివి పోకుండా నయం చేయబడు తుంది.

జుట్టురాలటం, తెల్లవెంట్రుకలు రావడం లాంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంపై ఏర్పడే కొవ్వుగడ్డలు, వేడికురుపులకు ఈ ఆకును పేస్ట్ లా చేసి గడ్డలు, కురుపులమీద కట్టు కట్టడం వలన అవి తగ్గుతాయి. శరీరంలో వాపులు కలిగిన చోటు ఈ ఆకుల పేస్టును కట్టు కట్టడం ద్వారా వాపుతగ్గవచ్చు.

కామెర్ల వ్యాదిగ్రస్తులు ఉదయం, సాయంత్రం ఈ ఆకు రసం తీసు కోవడం వలన వ్యాధి నయం అవుతుందని అంటున్నారు.

Post a Comment

0 Comments