GET MORE DETAILS

ఐటీ రిఫండ్ రూ.1 లక్ష దాటితే నోటీసులు.

ఐటీ రిఫండ్ రూ.1 లక్ష దాటితే నోటీసులు.



దేశంలో అత్యధికంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్పుడు క్లెయిమ్స్ చేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇలా తప్పుడు క్లెయిమ్‌ల ద్వారా కోట్లాది రూపాయలు స్వాహా చేసినట్లు గుర్తించిన క్రమంలోనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా నిఘా పెట్టింది.

 క్రమంలో ఒక ఫైనాన్షియల్ ఏడాదిలో రూ. 1 లక్ష అంతకంటే ఎక్కువ రిఫండ్ క్లెయిమ్ చేసుకున్న పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయనుంది. ఇ-మెయిల్ ద్వారా వారికి నోటీసులు అందుతున్నాయి. 

ఇలా ఐటీ శాఖ ద్వారా నోటీసులు అందినట్లయితే ట్యాక్స్ పేయర్స్ తమ రిఫండ్ సంబంధిత ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. వాటిని తనిఖీ చేసిన తర్వాత తప్పుడు పత్రాలు ఉన్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది.

రూ. 1 లక్ష ఆపైన రిఫండ్ల తనిఖీ పూర్తయిన తర్వాత తక్కువ రిఫండ్ల క్లెయిమ్స్‌లోని అనుమానిత ట్రాన్సాక్షన్లపై దృష్టి సారించనుంది ఐటీ శాఖ.

Post a Comment

0 Comments