GET MORE DETAILS

నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం - మిత్రులందరికీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం - మిత్రులందరికీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు



జాతి వివక్షను దూరం చేసేందుకు అంతర్జాతీయంగా ఫ్రెండ్‌షిప్‌ డేని నిర్వహించాలని అమెరికాకు చెందిన డా.అర్టీనియో బ్రాకో తొలుత 1950 జులై 28న ప్రతిపాదించాడు. తన మిత్రులతో కలిసి ఒక విందులో పాల్గొన్న సందర్భంలో అర్టీనియో బ్రాకోకి ఈ ఆలోచన స్ఫురించడంతో మెక్సికోలోని ప్యుర్టో పినాస్కో అనే ఒక చిన్న గ్రామంలో ఫ్రెండ్‌షిప్‌ డే వేడుకల్ని నిర్వహించారు. అప్పటినుంచి అమెరికాతోపాటు చుట్టుపక్కల చిన్న దేశాల్లో ప్రతి సంవత్సరం జులై 30న జాతి, కుల, మతాలకి అతీతంగా ఫ్రెండ్‌షిప్‌ డే వేడుకలు జరిగేవి. దక్షిణ అమెరికాలోని పెరుగ్వేలో 1958లో అధికారికంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు మొదలయ్యాయి. 2011 ఆగస్ట్‌ 29న ఐక్యరాజ్యసమితి జులై 30వ తేదీని ‘‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’’గా ప్రకటించింది. కానీ మనదేశంతోపాటు మరికొన్ని దేశాల్లో ఆగస్ట్‌ తొలి ఆదివారం స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 

Post a Comment

0 Comments