GET MORE DETAILS

ప్రభుత్వ ఉద్యోగులకు 20శాతం రాయితీతో ప్లాట్లు

ప్రభుత్వ ఉద్యోగులకు 20శాతం రాయితీతో ప్లాట్లు
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎంఐజీ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు లకు 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేసి, 20 శాతం రాయితీతో ఇస్తున్నామని ఏపీ | సీఆర్డీఏ కమిషనర్ వివేకాదవ్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 200, 240 చదరపు గజాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని, చదరపు గజానికి రూ. 17,499గా ధర నిర్ణయించామన్నారు. ఒప్పందం అయిన నెల లోపు మొత్తం సొమ్మును ఒకేసారి చెల్లించిన వారికి 5శాతం తగ్గింపు ఉంటుందని తెలిపారు. 40 శాతం అభివృద్ధి ధరపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు ఇస్తున్నట్లు వివ రించారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం ఉందని చెప్పారు. ఇతర వివరాలు ఎంఐజీ పోర్టల్ https://migapdtcp.ap.gov.in, ఏపీసీఆర్డీఏ పోర్టల్ https://crda.ap.gov.in లో ఆగస్టు 1 నుంచి అందు బాటులో ఉంటాయని తెలిపారు. ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 0866-2527124 ఫోన్ నంబరులో సంప్రదించాలని వివేక్యాదవ్ సూచించారు.

Post a Comment

0 Comments