GET MORE DETAILS

అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసు నమోదు

అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసు నమోదు



♦️విస్సన్నపేట జెడ్పీ హైస్కూల్ వసతులపై అసత్య కథనాలిచ్చారని ఎంఈవో ఫిర్యాదు

♦️336, 448, 501 (34) సెక్షన్ల కింద కేసు నమోదు

 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారం టూ కొన్ని పత్రికలు, చానళ్లలో వచ్చిన వార్తలు అవాస్తవమని, ఇందుకు బాధ్యులపై < చర్యలు తీసుకోవాలని విస్సన్నపేట ఎంఈవో సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం పాఠశాల వ్యాయామోపాధ్యాయుడు రమేశ్ ప్రోద్బలంతో విద్యా ర్థులను శిథిలమైన, నిరుపయోగంగా ఉన్న రేకుల షెడ్డులో కూర్చోబెట్టి కొందరు ప్రతినిధులు వీడియోలు, ఫొటోలు తీసి అసత్యపూరిత వార్తలను ప్రచారం చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రేణుక నేతృత్వంలో విచారణ అనంతరం నిర్ధారిం చారు. ఎంఈవో సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసత్య వార్తలను ప్రసారం, ప్రచారం చేసిన వ్యక్తులపై ఐపీసీ 336, 448, 501 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తిరువూరు సీఐ భీమరాజు తెలిపారు. పాఠశాల ఆవరణలోకి అక్ర మంగా, అనుమతి లేకుండా ప్రవేశించి ఫొటోలు, వీడియోలు తీయడం, ప్రమాదక రంగా ఉన్న రేకుల షెడ్డులో విద్యార్థులను బలవంతంగా కూర్చోబెట్టడం, అసత్య కథ నాలను ప్రచారం చేయడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశామని, ఇందుకు బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకుంటామని సీఐ వెల్లడించారు.

Post a Comment

0 Comments