GET MORE DETAILS

ఆదాయపు పన్ను రిటర్నులు గడువు లోగా చేయకపోతే అపరాధ రుసుము ఎంతంటే..?

ఆదాయపు పన్ను రిటర్నులు గడువు లోగా చేయకపోతే అపరాధ రుసుము ఎంతంటే..?



గడువు తేదీ లోపు రిటర్నులు దాఖలు చేయడం ఎపుడూ మంచిది.

ఒకవేళ చేయకపోతే గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న మూలధన నష్టాలను భవిష్యత్ లాభా లతో సర్దుబాటు చేసుకునేందుకు కుదరదు.

అనివార్య పరిస్థితుల్లో గడువు తేదీ దాటితే అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.1,000; అంతకు మించి ఉన్నప్పుడు రూ.5,000 రుసుము వర్తిస్తుంది.

పన్ను చెల్లించాల్సి ఉన్న వారు.. నెలకు 1 శాతం సాధారణ వడ్డీని సైతం చెల్లించాలి.

ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించలేదు అనుకుందాం.. ఐటీ శాఖ నోటీసులను పంపిస్తుంది.

అప్పటికీ నిర్లక్ష్యం చేస్తే చెల్లించాల్సిన పన్నుపై 50 శాతం నుంచి 200 శాతం వరకూ జరిమానా విధించడంతోపాటు, చట్టపరమైన చర్యలకూ బాధ్యులవుతారు.

Post a Comment

0 Comments