GET MORE DETAILS

నేడే 𝐏𝐒𝐋𝐕-𝐂56 ప్రయోగం : ఏడు సింగపూర్‌ ఉపగ్రహాలు కక్ష్యలోకి - ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇస్రో చైర్మన్‌

 నేడే 𝐏𝐒𝐋𝐕-𝐂56 ప్రయోగం : ఏడు సింగపూర్‌ ఉపగ్రహాలు కక్ష్యలోకి - ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇస్రో చైర్మన్‌



 ఏడు సింగపూర్‌ ఉపగ్రహాలు కక్ష్యలోకి

✦ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇస్రో చైర్మన్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 6.31గంటలకు ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ మేరకు శనివారం ఉదయం 5:01గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ఈ రాకెట్‌ ద్వారా సింగపూర్‌కు చెందిన 360 కిలోల బరువు గల డీఎ్‌స-సార్‌ ప్రధాన ఉపగ్రహంతో పాటు మరో ఆరు చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ షార్‌కు శుక్రవారం రాత్రే చేరుకొని కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పరిశీలించి ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది ఇస్రోకు ఇది మూడో వాణిజ్య ప్రయోగం కావడం విశేషం. కౌంట్‌డౌన్‌ జరిగే సమయంలో రాకెట్‌లోని రెండో, నాలుగో దశల్లో ధ్రవ ఇంధనం, హీలియం గ్యాస్‌ నింపే ప్రక్రియను పూర్తి చేసిన శాస్త్రవేత్తలు... అన్ని దశల పనితీరును క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. రాకెట్‌ నింగిలోకి ఎగిరిన తరువాత 535 కిలోమీటర్ల ఎత్తులో లోఎర్త్‌ ఆర్బిట్‌లో ఉపగ్రహాలను విడిచిపెట్టనుంది.

Post a Comment

0 Comments