GET MORE DETAILS

మాతృభాషలోనే ఇక దేశంలోని చదువు - ప్రధాన నరేంద్ర మోదీ ఉద్ఘాటన

మాతృభాషలోనే ఇక దేశంలోని చదువు - ప్రధాన నరేంద్ర మోదీ ఉద్ఘాటన



👉సాంఘిక శాస్త్రం నుంచి ఇంజినీరింగ్ వరకు బోధనంతా భారతీయ భాషల్లోనే

👉నూతన విద్యావిధానంతో విప్లవాత్మక మార్పులురానున్నాయి.

నూతన విద్యావిధానంతో భారత్లోని భాషలన్నింటికి తేనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో భాషలతో రాజకీయాలు చేసి కొందరు తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారని.. వారంతా ఇక తమ దుకాణాలు మూసుకోవాల్సిందేనని అన్నారు. ప్రధానమంత్రి శనివారం (జులై 29) ఇక్కడ ప్రగతి మైదాన్లో 'అఖిల భారత శిక్షా సమాగం' మూడో వార్షికోత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సాంఘిక శాస్త్రం నుంచి ఇంజినీరింగ్ వరకు బోధన ఇక మాతృభాషలోనే జరగనుందని చెప్పారు. “సామర్ధ్యం ఆధారంగా కాకుండా భాషను బట్టి విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తున్నాం. ఇది యువ ప్రతిభకు మనం చేస్తున్న అతి పెద్ద అన్యాయం. అందుకే నూతన విద్యా విధానం తీసుకొచ్చాం. ఇక మాతృభాషలో బోధన ద్వారాభారత్లో యువ ప్రతిభకు అసలైన న్యాయం జరగనుంది. సామాజిక న్యాయపరంగానూ ఇది కీలక అడుగు. అభివృద్ధి చెందిన చాలా దేశాలు తమ భాష ద్వారే ప్రగతి సాధించాయి. ఐరోపానే తీసుకుంటే అక్కడ చాలా దేశాలు.. తమ స్థానిక భాషలనే వినియోగిస్తాయి. మనం మాత్రం ఎన్నో భాషలు అందుబాటులో వెనకబాటుతనానికి ఉన్నా.. వాటిని చూపించాం. ఇంత కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది..! ఎంత తెలివైన వ్యక్తి అయినా.. అతనికి ఇంగ్లీషు రాకపోతే ఆ ప్రతిభను తొందరగా స్వీకరించం. దీని వలన గ్రామీణ భారతంలోని తెలివైన విద్యార్థులకు అతి పెద్ద నష్టం వాటిల్లింది. విద్యావిధానంతో తొలగించడానికి ఈ హీన భావనను ప్రారంభించాం. ఐక్యరాజ్యసమితిలోనూ నేను భారత భాషలో మాట్లాడతాను. దీనివల్ల వినేవాళ్లకు చప్పట్లు కొట్టడానికి సమయం పడుతుందేమో పట్టనీయండి. శాస్త్రాల నుంచి ఇంజినీరింగ్ వరకు బోధన ఇక భారతీయ భాషల్లోనే జరగనుంది. మాతృభాషతో ఇంకో పెద్ద లాభం కూడా ఉంది. అదేంటంటే ఇప్పటివరకు భాషా రాజకీయాలతో విద్వేషాలకు తెరలేపిన వారు తమ దుకాణాలను మూసుకోవాల్సి ఉంటుంది. నూతన విద్యా విధానంతో దేశంలో ప్రతి భాషకూ గౌరవం లభించనుంది" అని మోదీ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments