GET MORE DETAILS

ఆ దేశంలో ఉచితంగా లక్షల రూపాయలు ఇస్తామంటే 99.02 % మంది వద్దన్నారు.

ఆ దేశంలో ఉచితంగా లక్షల రూపాయలు ఇస్తామంటే 99.02 % మంది వద్దన్నారు. ఆ దేశం పేరు స్విట్జర్లాండ్

ప్రపంచంలో ఈ దేశం పేరు వినని వారు ఉండరు. కొత్తగా పెళ్ళైయిన యువ దంపతులు ఆ దేశానికి హానీమూన్ కు వెళ్ళాలి అని కోరుకుంటారు. ఆ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవచ్చని.

భూతల స్వర్గంగా పేరొందిన దేశం, శీతల దేశమైనా ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, సెలయేర్లు, మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, అతి తక్కువ జనాభా, చుట్టుపక్కల ఉన్న అన్నిదేశాలతో చక్కటి సంబంధాలు, సైన్యం లేని దేశం (పేరుకు సైన్యముంది కానీ యుద్ధం చెయ్యడానికి కాదు. రెడ్ క్రాస్ సహాయకులుగా, శాంతి బృందాలుగా పనిచేస్తారు), శత్రువులు లేని దేశం. 18 ఏళ్ళు దాటితే మొగపిల్లలకు నిర్బంధ సైనిక శిక్షణ ఉందా దేశంలో.

స్విట్జర్లాండ్ పేరు వింటే ఆ దేశపు బ్యాంకు వ్యవస్థ గుర్తుకు వస్తుంది. (చాకలెట్స్, చీజ్ కు కూడా ఆ దేశం ప్రసిద్ధి పొందింది)

ఈ దేశానికి ఇంకో ప్రత్యేకత ఉంది. పౌరులందరూ చదువుకున్న వారే. ప్రభుత్వం ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే అది ప్రజాభిప్రాయ ప్రకారమే సాధ్యపడుతుంది. మన దేశంలో చట్టసభల్లో సభ్యుయుల నిర్ణయమే అంతిమమం. అక్కడ అలా కాకుండా దేశప్రజాలకు ఉపయోగపడే చట్టాలు *"ప్రజాభిప్రాయ సేకరణతోనే సాధ్యం"*. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే నిర్బంధ వోటింగ్ ప్రజాభిప్రాయ సేకరణలో. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ హక్కును వినియోగించుకోవాలిసిందే.

మిగతా దేశాల బ్యాంకులకు స్విట్జర్లాండ్ బ్యాంకులకు తేడా ఏమిటి? ఎందుకు అవి అంత ప్రాచుర్యం కలిగి ఉన్నాయి ఒకప్పుడు?

ఆ దేశంలో ఉన్న ఎన్నో బ్యాంకుల్లోకి ప్రసిద్ధి పొందింది *"స్విస్ బ్యాంక్"* (ఇప్పుడు పేరు మారి UBS గా అందరికి పరిచయం). రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ స్విస్ బాంక్ ఒక కొత్త విధానాన్ని ప్రారంభించి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అత్యంత ధనిక దేశం. ఈ దేశం గురించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.

ఆక్కడి బ్యాంకుల విధానమేమిటంటే ప్రపంచంలో ఏ దేశ ధనిక పౌరుడైన స్విస్ బ్యాంకులో ఖాతా తెరవచ్చు. వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి.

ఇతర దేశాల "ధనిక" పౌరుడు ఎలా సంపాదించాడు అన్నది ఆ బ్యాంకు అడగదు. ఒక నియంత తన దేశాన్ని దోచుకుని స్విస్ బ్యాంకులో దాచుకోవచ్చు, స్మగ్లర్లు, మాఫియా డాన్లు, మాధకద్రవ్యాల వల్ల సంపాదించినవారు, లాంచగొండి రాజకీయ నాయకులు, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారస్తులు, మోసపురితంగా సంపాదించిన సొమ్ము, ఇలా ఎవరైనా అక్కడి బ్యాంకులో డబ్బుని మదుపు చెయ్యవచ్చు. రెండే రెండు రూల్స్ మాత్రం వర్తిస్తాయి.

మాములుగా మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే బ్యాంక్ మనకు వడ్డీ చెల్లిస్తుంది. కానీ స్విస్ బ్యాంక్ మాత్రం తన ఖాతాదారుల నుంచి రుసుము వసూలుచేస్తుంది. ఖాతాదారులు డబ్బే కాదు, ఖరీదైన వజ్రాలు, బంగారం, బంగారు నగలు, పెయింటింగ్స్, వెలకట్టలేని పురాతన వస్తువులు కూడా అక్కడి వాల్ట్స్ లో భద్రపరుచుకోవచ్చు.

స్విస్ బ్యాంకు ఖాతాదారులకు ఒకే ఒక షరతు విధిస్తుంది. ఇది మొదటి రూల్. ఖాతా తెరిచినప్పుడు ఫోటో, చిరునామా ఏది అడగదు . రీఛార్జి కార్డులా ఖాతాదారునికి అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ మాత్రం ఇస్తుంది. లాకర్ తీసుకున్న వారికి తాళం చెవి ఇస్తుంది, ఇంకో తాళం తమ దగ్గర ఉంచుకుంటుంది. లాకర్ అంటే మనకు ఇచ్చే లాకర్ సైజ్ నుంచి, కావాలంటే ఒక పెద్ద గది అంత లాకర్ కూడా అద్దెకు ఇస్తారు. ఖాతాదారుల దాచుకునే వస్తువులను బట్టి లాకర్ పరిణామం. ఈ లాకర్స్ అవి కూడా భూమిలో నాలుగైదు అంతస్తుల కింద ఉంటాయి పటిష్టమైన భద్రతతో. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆ లాకర్స్ దొంగలు దోచుకోలేకపోయారు అంటే ఊహించుకోవచ్చు ఎన్ని రకాల భద్రతా వలయాలు ఉన్నాయో.

బ్యాంకు ఖాతాదారుని గుర్తుపెట్టుకోదు. అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ చెప్పిన వ్యక్తికి ఖాతా నుంచి డబ్బులు తీసుకునే సౌకర్యం ఉంది. అలాగే ఆ రెండూ చెప్పి లాకర్ తాళం చెవి చూపిస్తే లాకర్ తెరిచే సౌలభ్యం ఏర్పరిచింది. 

ఇంకొక రూలు ఏమిటంటే ఖాతాలో ఎంత మొత్తం అయినా ఉండనివ్వండి, లేదా లాకర్స్ లో ఎంత విలువైన సామాగ్రి అయినా ఉండనివ్వండి. బ్యాంకు నిర్ణయించిన కాల పరిమితి లోపు ఖాతాను వాడకపోతే, అంటే ఒక పదేళ్లు లేదా ఇరవై ఏళ్ళ కాలం కావచ్చు, అప్పుడు ఆ ఖాతాను జప్తు చేసి అందులో ఉన్న మొత్తాన్ని ప్రభుత్వానికి అందచేస్తారు. 

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ప్రపంచంలో అత్యంత ధనవంతులు యూదులు. జర్మనీ , పోలాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, లక్సంబర్గ్ , నెదర్లాండ్స్ తదితర దేశాల యూదులే కాకుండా అమెరికాలో ఉన్న యూదులు కూడా ఈ బ్యాంకులో లెక్కపెట్టలేనంత డబ్బులు, బంగారం, వజ్రాలు, పెయింటింగ్స్ , కళాఖండాలు దాచుకున్నారు. అదంతా వారి కష్టార్జితం.

వీరే కాకుండా జర్మనీకి చెందిన నాజీ ఉన్నతాధికారులు, సైన్యాధికారులు యూదుల నుంచి కొల్లకొట్టిన కళాఖండాలు, బంగారం, నగదు దాచుకున్నారు. 

యుద్ధానంతరం యూదులు, అధికారులు, సైన్యాధికారులు చాలామంది తిరిగి రాలేదు తమ సొమ్ముని తీసుకోవడానికి. 

ఆ తరువాతి సంవత్సరాల్లో వివిధ దేశాధినేతలు, నియంతలు, మాఫియా డాన్ లు, మాధకద్రవ్యాల అక్రమ రవాణాదారులు, ఇతరులు తన అక్రమార్జనను ఈ బ్యాంకులో దాచుకొని తిరిగి రానివారున్నారు. 

ఆ విధంగా విపరీతంగా ధన నిలువలు పేరుకుపోయాయి. లాకర్స్ ఎన్నో ఏళ్లుగా తెరవకుండా పడి ఉన్నాయి. 

కొత్త శతాబ్ది ప్రారంభంలో అంటే 2000 సంవత్సరంలో ఇది జరిగింది.

అటువంటి పరిస్థితుల్లో ఒక సుముహూర్తాన అటువంటి ఖాతాలు అన్నిటికీ నోటీసులు ఇచ్చి నిర్ణీత సమయానికి ఎవరూ రాకపోతే ఆ ఖాతాలు జప్తు చేయబడ్డాయి. చేసిన ఖాతా లోంచి స్వాధీనం చేసుకున్న సొమ్ముని ప్రభుత్వ ఖజానాకు తరలించడం జరిగింది.

అలా ప్రభుత్వ ఖజానాకు వచ్చిన మొత్తం ప్రపంచంలోని నల్లధనంలో నలభై శాతం.

ప్రభుత్వం ఆయాచితంగా వచ్చిన సొమ్ముని ఎలా ఉపయోగించు కోవాలో అర్ధం కాక ప్రజాభిప్రాయం తెలుసుకుందాం అని తమ దగ్గర ఉన్న సొమ్ము ప్రతి పౌరునికి పంచితే ఒక మిలియన్ యూరోలు పైనే ముట్టుతాయి, లేదా ఏ రకంగా దేశ అభివృద్ధికి ఖర్చుపెట్టవచ్చో చెప్పండి మీ అభిప్రాయాన్ని అని వోటింగ్ నిర్వర్తించింది.

పదిహేను రోజుల సర్వే తరువాత 99.2% శాతం ప్రజలు, దేశ సుందరీకరణకు, తమ దేశాన్ని చూడడానికి వచ్చే యాత్రికుల సౌకర్యాలకు, టూరిజం అభివృద్ధికి ఖర్చుపెట్టాలి అని అభిప్రాయపడ్డారు.

దేశాభిమానులైన స్విట్జర్లాండ్ ప్రజలకు ఇదో పెద్ద విషయంలా అనిపించలేదు. ప్రతి పౌరునికి మిలియన్ యురొలు ఉచితంగా ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ సౌభాగ్యనికి ఆ దేశ ప్రజలు ఓటు వేశారంటే, మిగతా దేశ పౌరులకు ఆశ్చర్యం కలగవచ్చు.

ఆ దేశ పౌరుల నిశ్చిత అభిప్రాయం ఏమిటంటే ఎందరో ఎన్నో విధాలుగా అన్యాక్రాంతంగా సంపాదించింది, అమాయకుల నుంచి కొల్లగొట్టి దాచుకున్న సొమ్ము తమకు ఉచితంగా ఇచ్చినా వద్దు అనేది 99.2% ప్రజల స్థిర అభిప్రాయం.

ఇక్కడ ఇంకో తమాషా జరిగింది. 

2000 జనవరి 25వ తారీఖు ప్రజలు ప్రభుత్వ సర్వే ఆఫీసు ముందర బారులు తీరారు చేతిలో బ్యానర్స్ పట్టుకొని.

ఆ గుమిగూడిన ప్రజల డిమాండ్ ఏమిటంటే, ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న ఉచిత ఒక మిలియన్ యూరోలు కోసం ఆశ పడి అందుకోసం ఓటు వేసిన 0.8% ప్రజల పేర్లు బహిర్గతం చేయాలని వారి కోరిక. 

ఈ 99.2 శాతం ప్రజల అభిప్రాయం ప్రకారం ఉచిత సొమ్ముని ఆశపడిన ఆ 0.08 శాతం ప్రజలు దేశానికి మచ్చ తెచ్చారు, వారి పేర్లు బహిర్గతం చేస్తే మిగతా పౌరులు అటువంటి చీడపురుగులకు దూరంగా ఉంటాము అన్నది వారి అభిప్రాయం.

ప్రభుత్వ ప్రతినిధులతో చాలాసేపు జరిగిన సంప్రదింపులతో ఒక ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం వారి పేర్లు బయట పెట్టదు. కానీ వారిని తగురీతిలో శిక్షిస్తుంది అని ప్రభుత్వం చెప్పడంతో వారు శాంతించారు.

ఉచితాలు వద్దు అని 99.2 శాతం ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు అంటే, ఎంత తేడా మిగతా దేశ ప్రజలకు స్విట్జర్లాండ్ ప్రజలకు!? 

Post a Comment

0 Comments