GET MORE DETAILS

"వ్యాయామంతో 'జ్ఞాపకం' !

 "వ్యాయామంతో 'జ్ఞాపకం' !



చిన్నదైనా చాలు వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. శరీరానికే కాదు, మెదడుకు కూడా నడవటం, వ్యాయామ సైకిల్ తొక్కటం వంటి ఒక మాదిరి వ్యాయామాలతోనూ జ్ఞాపకశక్తి ఎంతగానో మెరుగుపడుతున్నట్టు తాజా ప్రయోగ పరీక్షలు చెబుతున్నాయి. ముఖ్యంగా మతిమరుపుతో సతమతమవుతున్న వృధ్ధులకైతే మరెంతో మేలు చేస్తుందనటం గమనార్హం. ఇలాంటి వ్యాయామాలను ఆరు నెలలు పాటు చేసినా మెదడు వయసు సుమారు 9 సంవత్సరాలు తగ్గినంత సమానంగా ఫలితం చూపుతుందనటం విశేషం. దీంతో ఎకాగ్రత, ప్రవర్తన అదనపు పనులు సక్రమంగా చేసుకోవటం వంటివి గణనీయంగా మెరుగుపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇక వ్యాయామాలకు పండ్లు, కూరగాయలు తినటం కూడా తోడైతే ప్రభావం మరింత పుంజుకొంటోంది కూడా!

నడక, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, ఈత వంటి వన్నీ వ్యాయామాలు కిందకు వస్తాయి.

ఏరోబిక్ వ్యాయామాలు ఏదో ఒక్కసారిగా, ఉద్ధృతంగా చేసేసేవి కావు. ఓ మోస్తరు తీవ్రతతో, నిలకడగా ఎక్కువ సమయం, దీర్ఘకాలం చెయ్యాల్సినవి.

చాలామంది ఇంట్లో పనులు చేసుకుంటూ చాలా నడిచేస్తున్నాను, చాలా శ్రమ పడుతున్నానని భావిస్తుంటారు. రోజంతా కూర్చుని  ఉండిపోకుండా చురుకుగా ఉండటం మంచిదే గానీ.. ఇవేవీ మనం చేయాల్సిన ఏరోబిక్ వ్యాయామాలకు సాటి రావు.

ఈ వ్యాయామ లాభాలన్నీ దక్కాలంటే సమయం వృధా చేసుకోకుండా రోజూ కనీసం 30 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజులైనా వ్యాయామం చేయాలి.

Post a Comment

0 Comments