మహాభారత యుద్ధం తరువాత పాండవులలో ఎవరి కుమారులు జీవించి ఉన్నారు ? వారు ఎవరు ?
పాండవులకి ద్రౌపదితో కలిగిన ఐదుగురు కుమారులైన ఉపపాండవులు, యుద్ధం ముగిసిన రాత్రి నిద్రలో ఉండగా అశ్వత్థామచే చంపబడ్డారు. భీముడు హిడింబకి పుట్టిన ఘటోత్కచుడు యుద్ధంలో కర్ణుడి అస్త్రానికి మరణించాడు. అర్జునుడు సుభద్రకి కలిగిన అభిమన్యుడు 13వరోజున చక్రవ్యూహంలో చనిపోయాడు. అర్జునుడు ఉలూపికి పుట్టిన ఇరావాన్ 8వరోజున అలంబుసుడి చేతిలో మరణించాడు.
అర్జునుడు చిత్రాంగదకు పుట్టిన బభ్రువాహనుడు, మిగతా నలుగురు పాండవులకు ఇతర భార్యలతో కలిగిన సంతా• నం ఎవరూ కూడా యుద్ధంలో పాల్గొనలేదు. బభ్రువాహనుడు తల్లి తండ్రైన మలయధ్వజుడి రాజ్యానికి ఉత్తరాధికారి అయ్యాడు. మిగతావారు ఎక్కడున్నారు ఏమయ్యారు అనే ప్రస్తావన మహాభారతంలో కనపడదు.
పాండవుల కుమారుల పేర్లు:
• ప్రతివింద్యుడు - ధర్మరాజు / ద్రౌపది కుమారుడు
• సుతసోముడు - భీముడు / ద్రౌపది కుమారుడు
• శతానీకుడు - నకులుడు / ద్రౌపది కుమారుడు
• శ్రుతసేనుడు - సహదేవుడు / ద్రౌపది కుమారుడు
• శ్రుతకర్ముడు - అర్జునుడు / ద్రౌపది కుమారుడు
• యౌద్దేయుడు - ధర్మరాజు / దేవిక కుమారుడు
• ఘటోత్కచుడు - భీముడు / హిడింబ కుమారుడు
• సర్వగుడు - భీముడు / వలంధర కుమారుడు
• అభిమన్యుడు - అర్జునుడు / సుభద్ర కుమారుడు
• ఇరావాన్ - అర్జునుడు / ఉలూపి కుమారుడు
• బభ్రువాహనుడు - అర్జునుడు / చిత్రాంగద కుమారుడు
• నిరమిత్రుడు - నకులుడు / కరేణుమతి కుమారుడు
• సుహోత్రుడు - సహదేవుడు / విజయ కుమారుడు
0 Comments