GET MORE DETAILS

ముఖం పై నల్ల, తెల్ల మంగు మచ్చలు - సులభ చికిత్స

 ముఖం పై నల్ల, తెల్ల మంగు మచ్చలు - సులభ చికిత్సకారణాలు:

శరీరతత్వాన్ని బట్టి బొబ్బలు, మొటిమలు వ్యాపించటం చర్మానికి తగిలిన గాయాలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు, పుట్టు మచ్చలు మొదలైనవి కారణాలుగా చెప్పవచ్చు. వంశపారంపర్యం గానూ, హార్లోన్లలో సమతుల్యత లోపించడం వల కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను పోగొట్టడానికి సులభ చికిత్సలేంటో తెల్సుకుందాం.

1. గేదె పాలను చిలికి తీసిన వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే మచ్చలు తగ్గుతాయి.

2. పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి గేదె పాలల్లో నూరి రాస్తుంటే మంగు మచ్చలు తగ్గి చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి.

3. జాజికాయను మేక పాలలో అరగదీసి రాయడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది.

4. పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది.

5. పావు టీ స్పూన్‌ నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

6. టమాటోల గుజ్జుతో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటిలో కడగాలి. వ్యంగ మచ్చలు తగ్గి శరీర కాంతి కూడా వస్తుంది.

7.కలబంద గుజ్జును తీసి మచ్చలపై పూయాలి. ఆ మచ్చలపై తడి ఆరిపోయాక చల్లని నీటితో శుభరం చేసుకోవాలి. దీని వల్ల మచ్చలు తగ్గిపోతాయి. దీంతో పాటు ముఖంపైన ఉండే మొటిమల మంట, వాపు తగ్గుతుంది.

8. 1 టీ స్పూన్‌ టొమాటో రసం, 1 టీ స్పూన్‌ గంధం పొడి కలిపి, 2 టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

9. రోజ్‌ వాటర్‌, కీరా దోస రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెలలో చక్కని మార్పు వస్తుంది.

10. ఆలుగడ్డపై ఉన్న పొరను తొలగించి సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి రసం తీయాలి. దానిలో దూది నానబెట్టి మచ్చలపై పూసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే మచ్చలు తొలిగిపోతాయి.

Post a Comment

0 Comments