GET MORE DETAILS

అతిగా యంటాసిడ్స్ వాడుతున్నారా...? జాగ్రత్త !

 అతిగా యంటాసిడ్స్ వాడుతున్నారా...?  జాగ్రత్త !



ఛాతీపై బరువుగా ఉన్నట్లు ఫీల్ కావడం, గొంతు మండినట్లుగా అనిపించడం, ఆహారం కడుపులోంచి గొంతులోకి వస్తున్నట్లుగా అనిపించడం వంటివన్నీ అజీర్తి లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించగానే మెడికల్ షాపుల్లోకి వెళ్లి యాంటాసిడ్ మాత్రలు తీసుకోవడం, అజీర్తిని  తగ్గించే కొన్ని ద్రావణాలు నీళ్లలో కలుపుకొని తాగడం వంటి పనులు దాదాపు అందరూ చేస్తుంటారు.

అయితే  ఇలా తరచూ యాంటాసిడ్ మాత్రలు వాడటం, అజీర్తిని తగ్గించే పౌడర్లు, జెల్ లు కలుపుకొని తాగడం అంత మంచి పని  కాదంటున్నారు. అమెరికన్ పరిశోధకులు. ఆజీర్తి మందులతో పాటు యాంటాసిడ్ లు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు, H2 బ్లాకర్స్, అనే మందులు వాడే దాదాపు 26,000 మందిపై నిర్వహించిన పరిశోధనల్లో... ఈ మందులు వాడేవారిలో విటమిన్ B12 లోపం వస్తుందని అమెరికన్ పరిశోధకులు గుర్తించారు. ఈ అంశాలు జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో ప్రచురిత మయ్యాయి.

Post a Comment

0 Comments