భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం పాటుపడి ఉరి కంబం ఎక్కిన ఒక మరుగున పడిపోయిన స్వాతంత్ర సమరయోధుడి గురించి తెలుసుకుందాం
ఆయన పేరు సోహన్ లాల్ పతక్ , ఈయన అమృత్సర్ లో 7 జనవరి 1883 న ఒక నిరుపేద గుడి పూజారి అయిన చందా రాం కు ఏకైక సంతానంగా జన్మించారు . ఈయన తన చిన్నతనం నుండి అసాధారణ తెలివితేటలు , వాక్చాతుర్యం , నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవారు. కాని ఆర్ధిక పరిస్థితులు బాగుండకపోవడం చేత మధ్యలోనే చదువు ఆపివేశారు .ఆ తరువాత నీటి పారుదల శాఖలో క్లార్క్ గా చేరారు , కొ న్నాళ్ళు పనిచేశాక తన చదువును కొనసాగించడానికి తగిన డబ్బు సంపాదించాక , ఉద్యోగాన్ని వదిలి లాహోర్లో చదువును కొనసాగించి పూర్తిచేశాక ఉపాధ్యాయ వృత్తిలో చేరారు.
తన తండ్రి చిన్నప్పటి నుండి నూరిపోసిన భారతదేశ స్వాతంత్ర కాంక్ష తన మెదడులో నాటుకుపోయింది . లాహోర్ లో 1905-1907 మధ్య స్వాతంత్ర సమరయోధుల పరిచయాలతో మరికొంత ఉత్తేజితుడయ్యాడు ,తన కుటుంబ ఆర్ధిక పరిస్థితిని లెక్కచేయకుండా తక్షణమే ఉద్యోగానికి రాజీనామా చేశాడు . వృద్దాప్యంలో ఉన్న తన తండ్రికి ఉత్తరం రాయగా , తండ్రి సోహన్ లాల్ స్వాతంత్ర పోరాటం కోసం చేసిన త్యాగాన్ని అభినందిస్తూ , తాము ఎలాగైనా బ్రతుకుతామని , తమ గురించి చింతించవద్దు అని. దేశం కోసం బ్రతకమని , భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా ఏర్పడేలా ప్రయత్నం చేయమని జవాబు రాసాడు. తండ్రి నుండి వచ్చిన సమాధానంతో మరికొంత ప్రేరేపితుడైన సోహన్లాల్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేఖంగా తన వాక్చాతుర్యంతో అతి తక్కువ సమయంలోనే ప్రజలలో చైతన్యం తీసుకురావడంలో సఫలమయ్యాడు . ఆతరువాత లాలా లజపత రాయ్ మొదలు పెట్టిన వందేమాతరం అనే పత్రికకు ప్రధాన ఎడిటర్ గా సేవలు అందించాడు.
ఇదంతా గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేద్దామని ప్రయత్నించింది . ఆయన లాహోరు నుండి బర్మా మకాం మార్చి అక్కడ జనాలను బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా చైతన్యం చేయడం మొదలు పెట్టాడు . ఆయన మీద ఉన్న ప్రజాదరణ కారణం గా బ్రిటిష్ వారు చేయి వేయడానికి సాహసించేవారు కారు . ఆఖరున 1915 ఆగస్టు నెల 7 వ తారీఖున మేమ్యే(బర్మా ) సమీపంలో అతి రహస్యంగా అరెస్ట్ చేసారు . బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా పోరాడడం వలన రాజ ద్రోహ ఆరోపణలపై ఆయనకు ఉరిశిక్ష విధించారు . ఆయనను 10 ఫిబ్రవరి 1916 న ఉదయం 7 గంటలకి మరొక స్వాతంత్ర సమరయోదుడైన హరిరాం సింగ్ సహారి తో ఉరి తీసారు .ఉరి తీసే సమయంలో వందేమాతరం , రామ నామ్ సత్య హై అనే నినాదాలు చేస్తూ ప్రాణాలు వదిలారు .
0 Comments