వ్యాధులను నివారించే దాల్చిన చెక్క
ప్రతి వంటింట్లో కనిపించే దాల్చిన చెక్కతో చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. పొడి దాల్చిన చెక్క ఆకులు, బెరడు సుగంధ రూపంలో ఆహార రుచిని పెంచుతాయి .ఇది రక్తాన్ని శుభ్ర పరుస్తుంది. బరువు తగ్గిస్తుంది అనేక వ్యాధులను నివారించడంతో పాటు మైగ్రేన్ వంటి తలనొప్పిని కూడా తొలగిస్తుంది. దాల్చిన చెక్క వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
జీర్ణ సమస్యలు:
మీకు జీర్ణవ్యవస్థలో సనస్యలు ఉంటే కొద్దిగా దాల్చిన చెక్కను ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి తీసుకోండి. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
బరువు తగ్గడం:
దాల్చిన చెక్క మీ పెరుగుతున్న బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం:
దాల్చిన చెక్క మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇందుకోసం దాల్చిన చెక్క పొడి తేనె ముద్ద చేసి బ్రెడ్ తో తినండి. ఇది ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకు పోకుండా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల అవకాశాలను కూడా తగ్గిస్తుంది.
చర్మ సమస్య:
దాల్చిన చెక్క చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. మీకు చర్మం పై ఎక్కడైన దురద లాంటి సమస్యలు ఉంటే దాల్చిన చెక్క పొడితో తేనె కలిపి అక్కడ అతికించండి. ఎండిన తర్వాత దాన్ని అక్కడ శుభ్రం చేసుకోవాలి. దీంతో దురద సమస్య తగ్గుతుంది.
0 Comments