గుండెపోటు హఠాత్ పరిణామం కాదా?
రాత్రంతా నాతోనే ఉన్నాడే, అంతలోనే ఇలా ఎలా? హఠాత్తుగా ఎవరైనా గుండెపోటుతో చనిపోతే ఇలాగే విస్తుపోతుంటాం. అప్పటివరకూ ఆడుతూ, పాడుతూ తిరిగిన మనిషి ఉన్నట్టుండి మరణిస్తే ఎవరికీ నమ్మబుద్ధి కాదు. కానీ గుండెపోటు తీరే వేరు. చెట్టంత మనిషిని ఉన్నట్టుండి కుప్ప కూలుస్తుంది. అయితే ఇది హఠాత్ పరిణామం కాదా? పైకేమీ తెలియకుండా చాలాకాలంగా దీనికి బీజం పడుతూ వస్తుందా?
గుండెపోటు హెచ్చరికలేవీ లేకుండా వాడిచేస్తుండొచ్చు. కానీ ఏదో ఒక కారణం లేకుండా సంభవించటం అరుదు. ఓ భారీ తాజా అధ్యయనం ఇదే చెబుతోంది.. ఇందులో సుదీర్ఘంగా 20 ఏళ్ల పాటు 30 లక్షలకు పైగా మందిని పరిశీలించారు. తొలిసారి గుండెపోటు, పక్షవాతం, గుండె వైపల్యం బారినపడ్డవారిలో సుమారు 99% మందిలో ప్రధానంగా నాలుగు ముప్పు కారకాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నట్టు గుర్తించారు. అన్నీ కాకపోయినా చాలామందిలో ఏదో ఒకటి ఉండటం గమనార్హం. అవి ఇవీ..
1. అధిక రక్తపోటు:
గుండెపోటు బారినపడ్డ ప్రతి 10 మందిలో తొమ్మిది కన్నా ఎక్కువమంది అధిక రక్తపోటు గలవారే కావటం గమనార్హం. రక్తపోటు చాలా ఏళ్లుగా ఎక్కువగా ఉంటూ వస్తున్నట్టయితే రక్తనాళాలు దెబ్బతింటూ వస్తుంటాయి. గట్టిపడి సాగేగుణం తగ్గుతుంది.. రక్తనాళాల లోపల చిన్న చిన్న చీలికల వంటివి ఏర్పడితే అక్కడ కొప్పు కొలెస్ట్రాల్ తేలికగా అంటుకుంటాయి. దీంతో లోపలి మార్గం సన్నబడుతుంది. ఫలితంగా రక్తాన్ని పంప్ చేయటానికి గుండె మరింత బలంగా పనిచేస్తుంది. క్రమంగా ఇది గుండె వైఫల్యం, హరాత్ గుండెపోటుకు దారితీస్తుంది.
2. అధిక కొలెస్ట్రాల్:
కొలెస్ట్రాల్ ముఖ్యంగా చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పెరిగితే అది రక్తనాళాల గోడల్లో పేరుకోవటం మొదలవుతుంది. క్రమంగా అక్కడ పూడికలు ఏర్పడతాయి. ఇది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. పూడిక చిట్లిపోతే, రక్తం గడ్డకట్టి ఉన్నట్టుండి రక్తనాళం మొత్తం మూసుకుపోవచ్చు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో రక్తం గడ్డకడితే గుండెపోటు సంభవిస్తుంది. మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే పక్షవాతానికి దారితీస్తుంది.
ఈ పూడికలు ఏర్పడటమనేది చాలా నెమ్మదిగా సాగుతూ వస్తుంటుంది. చాలాసార్లు నొప్పి, హెచ్చరిక లక్షణాల వంటివేవీ ఉండకపోవచ్చు. పైకి అంతా బాగున్నట్టే అనిపించినా లోలోపల అనర్థం జరుగుతూనే ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడూ కౌలెస్ట్రాల్ పరీక్ష చేయిందుకొని, మోతాదులు ఎలా. ఉన్నాయో చూసుకోవాలి. ఎక్కువుంటే ఆహార, వ్యాయామ నియమాలతో తగ్గించుకోవాలి. కొందరికి జన్యుపరంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండొచ్చు. ఇలాంటివారు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
రక్తపోటు పెరిగితే తలనొప్పి, తల తిప్పటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయని చాలామంది. బావిస్తుంటారు. ఇది నిజం. కాదు. ఇలాంటి లక్షణాలేవీ లేకపోయినా రక్తపోటు అదికంగా ఉండొచ్చు. కాబట్టి ఏటా ఒకసారైనా బీపీ పరీక్ష చేయించుకోవాలి ఎక్కువుంటే. తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆహార, వ్యాయామ నియమాలతో అదుపులోకి రాకపోతే విధిగా మందులేసుకోవాలి,
3. అధిక గ్లూకోజు:
గ్లూరోజు మోతాదులు ఒకింత ఎక్కువగా ఉన్నా.. అంటే మధుమేహంగా నిర్ధారించే స్థాయిలో ఎక్కువగా లేకపోయినా కూడా చేటే, గుండె, మెదడు, రక్తనాళాలకు కీడు చేస్తుంది. రక్తనాళాల లోపలి పైపొరను గ్లూకోజు దెబ్బతీస్తుంది. వాపు ప్రక్రియను ప్రేరేపిస్తుంది. పూడికలు ఏర్పడటాన్ని ప్రోత్సహించి, రక్తనాళాలు గట్టిపడేలా చేస్తుంది. అంతేకాదు, చెడ్డ కొలెస్ట్రాల్, రక్తపోటు పెరిగేలా చేస్తుంది కూడా. ఇవన్నీ గుండెకు చేటు చేసేవే.
చాలామంది గ్లూకోజు మోతాదులను పెద్దగా పట్టించుకోడు. లక్షణాలేవీ లేవు కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది పెద్ద తప్పు గ్లూకోజు మోతాదులు పెరిగినా పైకి ఎలాంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి తరచూ గ్లూకోజు మోతాదులను పరీక్షించుకోవటం మంచిది.
4. పొగాకు వాడకం:
పొగాకు గుండెకు పెద్ద శత్రువు, సిగరెట్లు, చుట్టలు, బీడీల వంటివి కాల్చినా... ఇతరులు కాల్చినప్పుడు వెలువడే పొగను పీల్చినా ప్రమాదమే. ఇది రక్తనాళాల లోపలి మార్గం సన్నబడేలా చేస్తుంది.. రక్తంలో ఆక్సిజన్ స్థాయులను తగ్గిస్తుంది. రక్తం గడ్డలు ఏర్పడే ముప్పును పెంచుతుంది. కొలెస్ట్రాల్ మోతాదులూ ఎక్కువవుతాయి. ఇవన్నీ గుండె, మెదడుకు చేటు. కలిగించేవే అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందనప్పుడు గుండె మరింత బలంగా కొట్టుకోవటం మొదలెడుతుంది. ఇది గుండెపోటు, పక్షవాతానికి దారితీస్తుంది.
సిగరెట్లు, చుట్టలు, బీడీలు, హుక్కా వంటి వాటికి దూరంగా ఉండాలి. అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. ఇంట్లోనూ ఎవరినీ పొగ తాగనీయొద్దు. ఎప్పుడో అప్పుడు ఒకటి ఆరా సిగరెట్లు కాలిస్తే ఏమీ కాదని అనుకోవద్దు.
.jpeg)
0 Comments