GET MORE DETAILS

University Movie Ready to Release: ఆర్ నారాయణ మూర్తి 'యూనివర్సిటీ'కి అంతా క్లియర్. ప్రముఖులకు ప్రివ్యూ

University Movie Ready to Release: ఆర్ నారాయణ మూర్తి 'యూనివర్సిటీ'కి అంతా క్లియర్. ప్రముఖులకు ప్రివ్యూ



అందరూ కుటుంబాలతో థియేటర్ కు వెళ్ళి చూసి ప్రోత్సహించాలి

స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి (People Star R Narayana Murthy) నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం 'యూనివర్సిటీ' (University).

ఈ చిత్రం ఈనెల 13న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో పలువురు ప్రముఖుల కోసం ప్రివ్యూను నిర్వహించారు. ఈ ప్రివ్యూని వీక్షించిన ప్రముఖులంతా.. ఈ సినిమా ఎడ్యుకేషన్ (Education) మీద తీసిన సినిమా అని తెలుపుతూ.. ఈ టైమ్‌లో ఈ సినిమా ప్రజలకు ఎంతో అవసరమని కొనియాడారు.

ప్రివ్యూని వీక్షించిన ప్రొఫెసర్ హర గోపాల్ మాట్లాడుతూ...

ఇది కేవలం విద్యార్థులే కాదు తల్లిదండ్రులు, అధ్యాపకులు చూడాల్సిన సినిమా. గత 40 ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, మన దేశంలోనూ జరిగిన.. జరుగుతున్న సమస్యలకు స్పందించి ఆర్ నారాయణమూర్తి సినిమాలు తీస్తున్నారు. భావితరాలకు మన చరిత్రను చిత్రబద్దం చేస్తున్నందుకు అభినందిస్తున్నానని అన్నారు.

ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ...

మన దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాధమిక దశ నుంచి మాతృ భాషతో పాటు ఇంగ్లీష్‌ను నేర్పుతూ వనరులు సమకుర్చీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఇస్తే.. ప్రభుత్వ విద్యారంగం బలోపేతమవుతుంది. ప్రవేట్ విద్యారంగం లేకుండా పోతుంది. విద్యార్థులను తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసే ఫీజుల దోపిడీ ఉండదు అనే అంశాన్ని ఈ చిత్రం ద్వారా చాలా గట్టిగా చెప్పారు నారాయణ మూర్తి. ఇది అందరూ చూడదగ్గ చిత్రమని అన్నారు. 

ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి మాట్లాడుతూ...

విద్య హక్కు కోసం, పని హక్కు కోసం రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌లు అమలు కోసం అందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని.. నిరుద్యోగ సమస్య ఈ దేశాన్ని ఎంత పట్టి పీడిస్తుందో ఈ చిత్రం ద్వారా బాగా చెప్పారని అన్నారు. బీసి నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఫీజుల దోపిడీ లేని చదువులు రావాలి అంటే విద్యార్థుల చదువుల పట్ల తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి అంటే.. విద్యను వైద్యను జాతీయం చేయాలనే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పయనించాలని ఈ చిత్రం ద్వారా చెప్పారని అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఆర్ నారాయణ మూర్తిగారు యూనివర్సిటీ అనే మంచి సినిమా తీశారు. ఈ సినిమాని నా అభిమానులతో పాటు అందరూ చూడాలని అన్నారు.

ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ...

చదువుకునే రోజుల్లో పేపర్ లీకేజ్.. గ్రూప్ వన్, గ్రూప్ 2 వంటి పరీక్షలలోనూ పేపర్ లీకేజ్‌లు. ఇలా అయితే విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నిసార్లు పరీక్షలు రాయాలి. పరీక్షల మీద పరీక్షలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం. విద్యార్థులు జాతి సంపద. వాళ్ళను రక్షించికోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. మనందరిపై, ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జూలూరి గౌరీ శంకర్, పాశం యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, ప్రొఫెసర్ కాశిం, బిసి నాయకులు గణేశ చారి, దర్శకులు కాశీ విశ్వనాథ్, వైఎస్ కృష్ణేశ్వర రావు ఇంకా అనేక మంది విద్యార్థి నాయకులు ప్రివ్యూ చూసి సినిమాని అభినందించిన వారిలో ఉన్నారు.

Post a Comment

0 Comments