GET MORE DETAILS

కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు

 కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు



1వ రోజు

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు

దానములు : నెయ్యి , బంగారం

పూజించాల్సిన దైవము : స్వథా అగ్ని

జపించాల్సిన మంత్రము : ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా

ఫలితము : తేజోవర్ధనము


2వ రోజు

నిషిద్ధములు : తరగబడిన వస్తువులు

దానములు : కలువపూలు, నూనె, ఉప్పు

పూజించాల్సిన దైవము : బ్రహ్మ

జపించాల్సిన మంత్రము : ఓం గీష్పతయే - విరించియే స్వాహా

ఫలితము : మనః స్థిమితము


3వ రోజు

నిషిద్ధములు : ఉప్పు కలిసినవి, ఉసిరి

దానములు : ఉప్పు

పూజించాల్సిన దైవము : పార్వతి

జపించాల్సిన మంత్రము : ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా

ఫలితము : శక్తి, సౌభాగ్యము


4వ రోజు

నిషిద్ధములు : వంకాయ, ఉసిరి

దానములు : నూనె, పెసరపప్పు

పూజించాల్సిన దైవము : విఘ్నేశ్వరుడు

జపించాల్సిన మంత్రము : ఓం గం గణపతయే స్వాహా

ఫలితము : సద్బుద్ధి, కార్యసిద్ధి


5వ రోజు

నిషిద్ధములు : పులుపుతో కూడినవి

దానములు: స్వయంపాకం, విసనకర్ర

పూజించాల్సిన దైవము : ఆదిశేషుడు

జపించాల్సిన మంత్రము : (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)

ఫలితము : కీర్తి


6వ రోజు

నిషిద్ధములు : ఇష్టమైనవి , ఉసిరి

దానములు : చిమ్మిలి

పూజించాల్సిన దైవము : సుబ్రహ్మణ్యేశ్వరుడు

జపించాల్సిన మంత్రము : ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా

ఫలితము : సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి


7వ రోజు

నిషిద్ధములు : పంటితో తినే వస్తువులు, ఉసిరి

దానములు : పట్టుబట్టలు , గోధుమలు, బంగారం

పూజించాల్సిన దైవము : సూర్యుడు

జపించాల్సిన మంత్రము : ఓం. భాం. భానవే స్వాహా

ఫలితము : తేజస్సు, ఆరోగ్యం


8వ రోజు

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం

దానములు : తోచినవి - యథాశక్తి

పూజించాల్సిన దైవము : దుర్గ

జపించాల్సిన మంత్రము : ఓం - చాముండాయై విచ్చే - స్వాహా

ఫలితము : ధైర్యం, విజయం


9వ రోజు

నిషిద్ధములు : నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి

దానములు : మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు

పూజించాల్సిన దైవము : అష్టవసువులు -పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము : ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః

ఫలితము : ఆత్మరక్షణ, సంతాన రక్షణ


10వ రోజు

నిషిద్ధములు : గుమ్మడికాయ , నూనె, ఉసిరి

దానములు : గుమ్మడికాయ , స్వయంపాకం , నూనె

పూజించాల్సిన దైవము : దిగ్గజాలు

జపించాల్సిన మంత్రము : ఓం మహామదేభాయ స్వాహా

ఫలితము : యశస్సు - ధనలబ్ధి


11వ రోజు

నిషిద్ధములు : పులుపు , ఉసిరి

దానములు: వీభూదిపండ్లు, దక్షిణ

పూజించాల్సిన దైవము : శివుడు

జపించాల్సిన మంత్రము : ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ

ఫలితము : ధనప్రాప్తి , పదవీలబ్ధి


12వ రోజు

నిషిద్ధములు : ఉప్పు , పులుపు, కారం, ఉసిరి

దానములు : పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ

పూజించాల్సిన దైవము : భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము : 

ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా

ఫలితము : బంధవిముక్తి , జ్ఞానం, ధన ధాన్యాలు


13వ రోజు

నిషిద్ధములు : రాత్రిభోజనం, ఉసిరి

దానములు : మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం

పూజించాల్సిన దైవము : మన్మధుడు

జపించాల్సిన మంత్రము : ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా

ఫలితము : వీర్యవృద్ధి, సౌదర్యం


14వ రోజు

నిషిద్ధములు : ఇష్టమైన వస్తువులు, ఉసిరి

దానములు : నువ్వులు , ఇనుము, దున్నపోతు లేదా గేదె

పూజించాల్సిన దైవము : యముడు

జపించాల్సిన మంత్రము : ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా

ఫలితము : అకాలమృత్యువులు తొలగుట


15వ రోజు

నిషిద్ధములు : తరగబడిన వస్తువులు

దానములు : కలువపూలు, నూనె, ఉప్పు 

జపించవలసిన మంత్రం : 'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'


16వ రోజు

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల

దానములు : నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము : స్వాహా అగ్ని

జపించాల్సిన మంత్రము : ఓం స్వాహాపతయే జాతవేదసే నమః

ఫలితము : వర్చస్సు, తేజస్సు, పవిత్రత


17వ రోజు

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు

దానములు : ఔషధాలు, ధనం

పూజించాల్సిన దైవము : అశ్వినీ దేవతలు

జపించాల్సిన మంత్రము : ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా

ఫలితము : సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం


18వ రోజు

నిషిద్ధములు : ఉసిరి

దానములు : పులిహార, అట్లు, బెల్లం.

పూజించాల్సిన దైవము : గౌరి

జపించాల్సిన మంత్రము : ఓం గగగగ గౌర్త్యె స్వాహా

ఫలితము : అఖండ సౌభాగ్య ప్రాప్తి


19వ రోజు

నిషిద్ధములు : నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి

దానములు : నువ్వులు, కుడుములు

పూజించాల్సిన దైవము : వినాయకుడు

జపించాల్సిన మంత్రము : ఓం గం గణపతయే స్వాహా

ఫలితము : విజయం, సర్వవిఘ్న నాశనం


20వ రోజు

నిషిద్ధములు : పాలుతప్ప- తక్కినవి

దానములు : గో, భూ, సువర్ణ దానాలు

పూజించాల్సిన దైవము: నాగేంద్రుడు

జపించాల్సిన మంత్రము : ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం

ఫలితము : గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి


21వ రోజు

నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , ఉప్పు, పులుపు, కారం

దానములు : యథాశక్తి సమస్త దానాలూ

పూజించాల్సిన దైవము : కుమారస్వామి

జపించాల్సిన మంత్రము : ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా

ఫలితము : సత్సంతానసిద్ధి, జ్ఞానం, దిగ్విజయం


22వ రోజు

నిషిద్ధములు : పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి

దానములు : బంగారం, గోధుమలు, పట్టుబట్టలు

పూజించాల్సిన దైవము : సూర్యుడు

జపించాల్సిన మంత్రము : ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా

ఫలితము : ఆయురారోగ్య తేజో బుద్ధులు.


23వ రోజు

నిషిద్ధములు : ఉసిరి, తులసి

దానములు : మంగళ ద్రవ్యాలు

పూజించాల్సిన దైవము : అష్టమాతృకలు

జపించాల్సిన మంత్రము : ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా

ఫలితము : మాతృరక్షణం , వశీకరణం


24వ రోజు

నిషిద్ధములు : మద్యమాంస మైధునాలు, ఉసిరి

దానములు : ఎర్రచీర, ఎర్రరవికె గుడ్డ , ఎర్రగాజులు, ఎర్రపువ్వులు

పూజించాల్సిన దైవము : శ్రీదుర్గ

జపించాల్సిన మంత్రము : ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా

ఫలితము : శక్తిసామర్ధ్యాలు , ధైర్యం, కార్య విజయం


25వ రోజు

నిషిద్ధములు : పులుపు, చారు వగయిరా ద్రవపదార్ధాలు

దానములు : యథాశక్తి

పూజించాల్సిన దైవము : దిక్వాలకులు

జపించాల్సిన మంత్రము : ఓం ఈశావాస్యాయ స్వాహా

ఫలితము : అఖండకీర్తి, పదవీప్రాప్తి


26వ రోజు

నిషిద్ధములు : సమస్త పదార్ధాలు

దానములు: నిలవవుండే సరుకులు

పూజించాల్సినదైవము: కుబేరుడు

జపించాల్సిన మంత్రము : ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా

ఫలితము : ధనలబ్ది, లాటరీ విజయం, సిరిసంపదలభివృద్ధి


27వ రోజు

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, వంకాయ

దానములు : ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు

పూజించాల్సిన దైవము : కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము : ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా

ఫలితము : మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి


28వ రోజు

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ

దానములు : నువ్వులు, ఉసిరి

పూజించాల్సిన దైవము : ధర్ముడు

జపించాల్సిన మంత్రము : ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా

ఫలితము :- దీర్ఘకాలవ్యాధీహరణం


29వ రోజు

నిషిద్ధములు : పగటిఆహారం, ఉసిరి

దానములు : శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము :- శివుడు (మృత్యుంజయుడు)

జపించాల్సిన మంత్రము :-

ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, 

ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్

ఫలితము : అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం


30వ రోజు

నిషిద్ధములు : పగటి ఆహారం, ఉసిరి

దానములు : నువ్వులు, తర్పణలు, ఉసిరి

పూజించాల్సిన దైవము : సర్వదేవతలు, పితృ దేవతలు

జపించాల్సిన మంత్రము : ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః.

Post a Comment

0 Comments