GET MORE DETAILS

డిసెంబ‌రు 22 నుండి 26వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు

డిసెంబ‌రు 22 నుండి 26వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు



తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 22 నుండి 26వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటిరోజైన డిసెంబ‌రు 22వ తేదీన శ్రీ వినాయక స్వామివారు పుష్కరిణిలో ఐదు చుట్లు విహరిస్తారు. రెండవ రోజైన డిసెంబ‌రు 23న‌ శ్రీ సుబ్రమణ్యస్వామివారు ఐదు చుట్లు, మూడవ రోజైన డిసెంబ‌రు 24న‌ శ్రీ సోమస్కందస్వామివారు ఐదు చుట్లు, నాలుగో రోజైన డిసెంబ‌రు 25న‌ శ్రీ కామాక్షి అమ్మవారు ఏడు చుట్లు, ఐదో రోజైన డిసెంబ‌రు 26న‌ శ్రీ చండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

డిసెంబ‌రు 27వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 6 నుండి 9 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు.

తెప్పోత్సవాల సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Post a Comment

0 Comments