పోషకాల నిధులు, ఆరోగ్య వరాలు - చిరుధాన్యాలు
• తాతల ఆరోగ్య రహస్యం - చిరుధాన్యాల వాడకం
• సామన్నం నోటిన పెట్టు - వరన్నం పక్కన పెట్టు
• సామపాయసం నోరూరించు - చోడి అంబలి ఆకలి తగ్గించు
• చోళ్లు తిందాం - రక్తహీనతకు దూరంగా ఉందాం
• బడి పిల్లలకు చిరుధాన్యాలు - బుద్ధి, బలాన్ని పెంచే చక్కని మార్గాలు
చోడి/రాగి:
◾ఇందులో ఉండే కాల్షియం దంతాలను, ఎముకలను బలంగా ఉంచుతుంది.
◾ఎదిగే వయసులో ఎముకలు బలంగా ఉండడానికి, శరీరం అంతటికీ ఆక్సిజన్ అందడానికీ కాల్షియం, ఇనుము కీలకం,
◾ఒక గ్లాసు చోడి/రాగి జావలో ఉండే కాల్షియం రెండున్నర గ్లాసుల పాలలో ఉండే కాల్షియంతో సమానం.
◾బాలింతలకు, గర్భిణులకు కాల్షియం చాలా అవసరం.
వరితో పోలిస్తే రాగులు/చోళ్లలో కాల్షియం 34 రెట్లు, ఖనిజ లవణాలు 4.5 రెట్లు, పీచు పదార్దాలు 18 రెట్లు, ఇనుము 5.5 రెట్లు అధికంగా ఉంటాయి.
సామలు:
◾సామలలో పీచు పదార్ధాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆహారం మెల్లగా జీర్ణమవుతుంది.
◾ఎక్కువ సమయం పని చేసేందుకు శక్తినిస్తుంది.
◾అధికంగా ఉండే ఇనుము, ఫోలిక్ ఆమ్లము రక్త పుష్టిని కలిగిస్తాయి.
◾చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచి ఆహారం.
వరితో పోలిస్తే సామలలో పీచు పదార్థాలు 38 రెట్లు, ఇనుము 13 రెట్లు, థయామిన్ 5 రెట్లు, ఖనిజ లవణాలు, జింక్ 2.5 రెట్లు అధికంగా ఉంటాయి.
కొర్రలు:
◾ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల ఎదుగుదల బాగా ఉంటుంది.
◾ఎదిగే పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం.
◾ప్రోటీన్లు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి కనుక చక్కెర వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారం.
వరితో పోలిస్తే కొర్రల్లో 65 రెట్లు, మాంసకృత్తులు, పీచు పదార్ధాలు 40 రెట్లు, ఖనిజ లవణాలు, జింక్ 5.5 రెట్లు, ఇనుము 4 రెట్లు, కాల్షియం. విటమిన్ బి1 దాదాపు 10 రెట్లు, అధికంగా ఉంటాయి.
సజ్జలు(గంటెలు):
◾ఆహారం రుచిగా ఉంటుంది.
◾వీటిలోని పోషకాలు ఆహారాన్ని ఇంధనంగా మార్చి, రోజంతా శరీరం చురుకుగా ఉండేలా చేస్తాయి.
◾అధికంగా ఉండే ఇనుము, ఫోలిక్ ఆమ్లము రక్తపుష్టిని కలిగిస్తాయి.
◾ఫైటిక్ ఆమ్లము, నయసిన్లు చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి.
వరితో పోలిస్తే గంటెల్లో పీచు పదార్ధాలు 6 రెట్లు, ఇనుము 11 రెట్లు, ఫోలిక్ ఆమ్లం 5.5 రెట్లు, థయామిన్ 5 రెట్లు, ఖనిజ లవణాలు, జింక్ 2.5 రెట్లు అధికంగా ఉంటాయి.
జొన్నలు:
◾మాంసకృత్తులు, పీచు పదార్థాలు అధికంగా ఉన్నందున చక్కెర వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారం.
◾చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించి, గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది.
◾కొన్ని రకాల పండ్లు, ధాన్యాలతో పోలిస్తే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండుట వలన కాన్సర్ను అడ్డుకొనుటలో ఉపయోగ పడుతుంది.
వరితో పోలిస్తే జొన్నల్లో పీచు పదార్ధాలు 7 రెట్లు, మాంసకృత్తులు 46ట్లు, ఇనుము 13 రెట్లు, ఖనిజ లవణాలు 2 రెట్లు అధికంగా ఉంటాయి.
0 Comments