GET MORE DETAILS

సహజ ఔషధాలు - ఉపయోగాలు

 సహజ ఔషధాలు - ఉపయోగాలు కృతి ప్రసాదించే ఔషధాలు ఎటువంటి దుష్ప్రభావాలూ లేకుండా వుంటాయి. ఒక నాడు ఉపయోగించిన ప్రకృతి ఔషధాలపట్ల ఇప్పటి వారుకూడా బాగా మొగ్గుచూపుతున్నారు. సహజ హెర్బ్స్, స్ట్రెస్లు ఆరోగ్యానికి చేసే మేలు గురించి మొగ్గుచూపుతున్నవారి సంఖ్య పెరుగుతు న్నది. ఉపశమనానికి, వ్యాధుల నియంత్రణకు, పున రుత్తేజానికి, వీటి వాడకానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు.

ఈసాబ్ గుల్ 

భోజనానికి ముందు నీళ్ళలో రెండుస్పూన్లు ఇసాబుల్ (మార్కెట్లో లభిస్తుంది) కలుపుకుని తాగాలి. కొద్ది నెలలపాటు కొనసాగిస్తే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. తద్వారా బరువు తగ్గడం కూడా సాధ్యపడుతుంది.

లిపిడ్ స్థాయిలు తగ్గించుకోవడానికి బాగా ఉపక రిస్తుంది. మలబద్దకం సమస్యకూడా తగ్గిపోతుంది.

అల్లం 

అల్లంముక్కల్ని నోట్లో పెట్టుకుని చప్పరించినా. అల్లంరసం తాగినా వికారాన్ని, మార్నింగ్ సిక్ నెస్ను తగ్గించడంలో తక్షణ పరిష్కారం కాగలదు.

రోడ్డుమీదున్నా, సముద్రంలో వున్నా, విమానంలో వున్నా అల్లం ముక్క ఎంచుకుంటే చాలు, ప్రయాణాల్లో దీన్ని వెంట వుంచుకుంటే బాగా పనిచేస్తుంది. నిమ్మరసం, ఉప్పులలో నానబెట్టుకునే తినడింపల్ల ప్రయోజనాలు మరింత ఎక్కువగా వుంటాయి.

ఉసిరి

వ్యాధులతో పోరాడేందుకు సహకరించడమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను బలోపేతంచేస్తుంది. జలుబు, ఇతర వైరస్ నుంచి పరిరక్షిస్తుంది. విటమిన్ 'సి'కి తిరుగులేని ఆధారం. ప్రపంచంలోనే చౌక అయిన, సమృద్ధి అయిన విటమిన్ 'సి' ఆధారం.

ఉదర ఆమ్లాలనుకూడా సమతౌల్యపరిచి, గుండె, ఊపిరితిత్తుల్ని బలోపేతం చేస్తుంది.

సహజమైన యాంటీ కార్సినోజెనిక్, వెజిటబుల్ జ్యూస్లలో కలుపుకోవచ్చు. చిన్నచిన్నముక్కలుగా కట్చేసి, ఉప్పుజల్లి, కొద్దిరోజులు ఎండబెట్టి, నోట్లో వేసుకుని భోజనాల నడుమ చప్పరిస్తుండాలి.

అలోవెరా

కలబంద ఆకులో లెక్కలేనన్ని ప్రయోజనాలుం టాయి. ఔషధపరంగాను, సౌందర్యపరంగానూ కూడా అత్యుత్తమ ప్రయోజనకారి. సల్ఫర్, సిలికాన్, ఐరన్, జింక్, మాంగనీస్ వుంటాయి.

ఈ మొక్కలో యాంటీ పారాసిటాల్ ప్రభావాలు, అత్యధిక స్థాయిలో విటమిన్ ఎ, సి, ఇ వంటి యాంటీ అక్సిడెంట్లు వుంటాయి. ఈ గుణాలు ఆర్థరైటిస్, జాయింట్ నొప్పులనుంచి పరిరక్షిస్తాయి. ఆకుతోలు చెక్కేసి, లోపలి జెల్ను తిన్నా, పైపూతగా రాసినా ప్రయోజనాలు వుంటాయి.

ఈ జెల్ ప్లాంట్ స్టెరాయిడ్లు, పోలిసిలిక్ యాసిడ్స్ వుండి దాదాపు యాస్ప్రిన్ మాదిరి పని చేస్తూ, ఇన్ఫ్లమేషన్ నుంచి పరిరక్షిస్తాయి.

సౌందర్యపరంగా చూస్తే, క్లియోపాత్ర తాజా ఆలో వెరా జెల్తో మసాజ్ చేసుకోవడంద్వారా అందాన్ని పరిరక్షించుకున్నదని చెప్తారు. గాయాలకు, సూర్యకిర ణాలు సోకి కమిలిన చర్మానికి ప్రయోజనకారి. చర్మాన్ని బిగుతుగా చేసి, తక్షణ ఫేస్లిఫ్ట్ ఇస్తుంది.

Post a Comment

0 Comments