GET MORE DETAILS

ఇమ్యూనిటీ డైట్...!

 ఇమ్యూనిటీ డైట్...!



ఇమ్యూనిటీ డైట్ పైన దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. ఇమ్యూనిటీ డైట్ అనగానే ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది అను కోవడం పొరపాటే. మెనూలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.

• ప్రతిరోజు ఒక గ్లాసు పాలు లేదా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా తగినంత ఫైబర్, విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి.

• డైరీ ఉత్పత్తులు ఎక్కువగా తినాలి. పాలు, పెరుగు, వెన్న తీసుకోవాలి.

• వారంలో రెండు రోజులు ఆకుకూరలు తప్పనిసరి. రోజూ ఒక ఆరెంజ్ తినాలి. ఆరెంజ్లో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభి స్తుంది.

• బాదం, ఖర్జూర, పాలకూర, లివర్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

• శరీరం ఐరన్ ను గ్రహించటానికి విట మిన్ సి సహాయపడుతుంది. కాబట్టి సి విటమిన్ సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, బీన్స్ లో యాంటీ అక్సి డెంట్లు ఎక్కువగా లభిస్తాయి. పీనట్స్, వాల్నట్స్లో విటమిన్ ఇ, విటమిన్ బి లభిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంపొం దించడానికి ఇవి ఉపయోగపడతాయి.

• మాంసాహారంలో ఐరన్ సమృద్ధిగా లభి స్తుంది. శాకాహారులైతే ధాన్యాలు, ఆకుకూ రలు తీసుకోవాలి.

• అల్లం, పసుపు, వెల్లుల్లి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఆర్థరైటిస్ ను తగ్గించడా నికి అల్లం ఉపకరిస్తుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

• సోయా ప్రోటీన్ కొలెస్ట్రాల్ లెవె ల్స్ను తగ్గిస్తుంది. ఎముకలు, గుండె ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. సాల్మన్, ట్యూనా చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభి స్తాయి.

• మాంసాహారం, చేపలు, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, ధాన్యాలలో విటమిన్ బి12 ఉంటుంది.

• శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. ఇందులో పొటాషియం పుష్కలంగా లభి స్తుంది. 

• స్నాక్స్బ కి బదులుగా నట్స్ తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకొంటే శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.

Post a Comment

0 Comments