GET MORE DETAILS

ఆరోగ్య ప్రదాయిని విటమిన్ డి

 ఆరోగ్య ప్రదాయిని విటమిన్ డిసూర్యుడు జీవులకు ప్రధాన జీవనాధారం మరియు జీవులకు శక్తి యొక్క సహజ వనరు. సూర్యరశ్మి అంటే సూర్యుడు ఇచ్చే విద్యుదయస్కాంత వికిరణం సూర్య కాంతిలో కనిపించే కాంతి మరియు కనిపించని అతి నీల లోహిత కిరణాలు మరియు పరారుణ కిరణాలు ఉంటాయి. సూర్యరశ్మి వలన భూగ్రహం వేడెక్కుతుంది మరియు జలచక్రాన్ని నడుపుతుంది తద్వారా భూమిపై జీవితాన్ని సుసాధ్యం చేస్తుంది. విటమిన్ డి ఆరోగ్య సమస్యలు మారిన జీవన శైలి వలన ప్రపంచ జనాభాలో 50 శాతం ప్రజలు విటమిన్ డి లోపం కలిగి ఉన్నారు.

మనం సూర్యరశ్మికి గురైనట్లయితే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే పోషకం విటమిన్ డి. ఇటీవల కాలంలో చాలా మంది విటమిన్ డి లోపం బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. అధ్యయనాల ప్రకారం అమెరికా ప్రజలలో 40 శాతం విటమిన్ డి లోపం, 70-90 శాతం మంది భారతీయులు విటమిన్ డి లోపంతో. బాధపడుతున్నారని అధ్యయనాలు వెల్లడించించాయి.

మన రాష్ట్రంలో వృద్ధుల జనాభాలో (60 ఏళ్ళు పైబడినవారు) 56 శాతం మరియు మహిళలు 70 శాతం మందికి విటమిన్ డి లోపం తీవ్రంగా వుంది, జనాభాలో ఎక్కువ శాతం విటమిన్ డి. లోపం సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆధునిక జీవనశైలిలి ఆధునిక కాలంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఇంటి లోపల ఎక్కువ సమయం గడపడం వల్ల సూర్యరశ్మి శరరీరానికి తక్కువగా తాకుట వలస విటమిన్ లోపం ఏర్పడుతుంది. ప్రజలు రోజువారీ ఆహారంలో సిఫారసు చేయబడిన దాని కన్న తక్కువ ఆహారం ద్వారా విటమిన్ డి తీసుకోకపోవటం తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇదుకైన పరిసరాలలో మరియు గాలి వెంటిలేషన్ మరియు వెలుతురు లేని బహుళ అంతస్థుల అపార్ట్మెంట్ లలో నివసించే వారిలో విటమిన్ డి లోపం ఏర్పడుట సర్వ సాధారణమై పోయింది. విటమిన్ ఆహారం నుండి మాత్రమే కాకుండా, ఎక్కువ శాతం విటమిన్ డి సూర్యరశ్మి నుండి మనకు వస్తుంది. ఆహార పదార్ధాలలో విటమిన్ డి ఎక్కువగా ఉండదు కనుక సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి మనకు అవసరం.

నివాస భవనాలు సూర్య రష్మి సోకే విధంగా డిజైన్ చెయ్యాలి. సూర్య కాంతి విటమిన్ డిసూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వలన చర్మంలో ఉండే స్టెరాల్ విటమిన్ డి వలె మార్చబడతాయి. విటమిన్ డి. ఖనిజ శోషణతో పాటు అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. మరియు అనేక క్యాన్సర్ల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. శరీరానికి కావలసిన కాల్షియం శోషించడానికి విటమిన్ డి సహాయపడుతుంది. కాల్షియం చాలా ముఖ్యమైన పోషకం బలమైన ఎముకలకు కాల్షియం అవసరం. ఆహారంలో విటమిన్ డి లోపించుట వలన ఎముకల బలహీనతకు కారణమవుతుంది. మన గుండె, కండరాల సంకోచం మరియు సరాలు సరిగ్గా పనిచేయడానికి మరియు రక్తం గడ్డ కట్టడానికి కాల్షియం అవసరం.

విటమిన్ డి స్త్రీలు పిల్లల ఆరోగ్యంచి స్త్రీలలో 30-35 సంవత్సరాల వయస్సు నుండి పురుషులలో 55 సంవత్సరాల వయస్సు నుండి మొదలైన ఎముక ద్రవ్యరాశి కోల్పోకుండా ఉండాలంటే కాల్షియం అవసరం మరియు రుతువిరతి తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి సంభవిస్తుంది. చిన్న పిల్లలో విటమిన్ డి లోపం వల్ల పిల్లల పెరుగుదల లోపిస్తుంది. ఎక్కువ కాలం పాలు తాగే శిశువులు విటమిన్ డి లోపానికి గురౌతారు. తద్వారా వారు రికెట్స్ వ్యాధి భారిన పడే అవకాశం ఉంది. విటమిన్ డి రోగనిరోధకశక్తి విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థ పెరుగుదల చేస్తుంది. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటు మరియు టైప్ 2 డయాబెటిస్ తో విటమిన్ డి లోపం యొక్క పరస్పర సంబంధం కలిగివుందని అధ్యనాలు తెలుపుతున్నాయి. సూర్యరశ్మికి గురికావడం వలన ప్యాంక్రియాస్ ద్వారా ఇస్సులిన్ స్రావం జరుగుతుంది.

చిన్నతనంలోనే సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం మధుమేహం రాకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది. లివిటమిన్ డి కాలుష్యంలి సూర్యరశ్మి ఉన్నపటికీ విటమిన్ డి లోపం ఏర్పడుటకు మరొక కారణం కాలుష్యం. వాహనాల నుండి మరియు బొగ్గు కాల్చడం వలన సల్ఫర్ డై ఆక్సైడ్ వాయు వాతావరణంలో చేరడం పల్ల యు వి రేస్ పరావర్తనం / విచ్ఛిన్నం చెంది భూమిపై చేరుకొక పోవడంతో అతినీలలోహిత కిరణాలు మన శరీరంలో పైన పడుటలేదు తద్వారా విటమిన్ డి మన శరీరంలో తయారు కాకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. మరోవైపు అతినీల లోహిత కిరణాలకు ఎక్కువగా గురికావడం వల్ల చర్మంలోని ఫ్రీ రాడికల్స్ ఉత్తేజపరచబడి, క్యాన్సర్కు దారితీసి మరియు డి ఎన్.ఏ. సహా కణాలకు నష్టం కలిగిస్తుంది. ఓజోన్ పోర ప్రమాదకర యువి కిరణాల నుండి రక్షణ కలిగిస్తుంది.

వాహనాల నుండి వెలువడే వైట్రస్ ఆక్సైడ్, పరిశ్రమలు ఉపయోగించే రసాయనాలు, ఎయిర్ కండీషనర్ లో ఉపయోగించే రసాయనాలు మరియు ఇతర కాలుష్య కారకాలు ఓజోన్ పొరకు నష్టం కలిగిస్తాయి. విటమిన్ ఆహారపదార్ధాలు విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు ఆకు కూరలు, కాబేజీ, ముల్లంగి, బీన్స్ వంటి కూరగాయలు. నారింజ మరియు బాదం, జీడిపప్పు, మష్రూమ్, పాలు, కోడిగుడ్లు, చిన్ మరియు మాంసం, కాలేయం, చేప వంటి మాంసాహరం తినటం వలన మరియు సూర్య కాంతి కి(ఎండలో ఎక్కువగా ఉండటం) గురికావటం వలన విటమిన్ డి లోపం నివారించవచ్చు.

ఆధునిక ఇంటి నిర్మాణాలు విటమిన్ డిలి ఆధునిక ఇంటి నిర్మాణ విధానాలు డిజైన్స్ వల్ల ఇంటిలోకి సూర్యకాంతి రావటంలేదు. దీనివలన విటమిన్ డి లోపంతో పాటు ఇంటిలోకి సూర్యర రాకపోవుట వలన బ్యాక్టీరియ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నయి. కరోనా మహమ్మారి వ్యాప్తి జరిగి. ప్రజలు అనారోగ్యానికి గురికావడం వలన శ్రామిక సామర్థ్యం తగ్గి దేశములో ఉత్పత్తి ఉత్పాదకత ఆదాయాలు ప్రజల జీవన ప్రమాణం జిడిపి క్షీణించి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అర్కిటెక్ట్ లు మరియు ఇంజినీర్లు గృహనిర్మాణం చేసేటప్పుడు ఇంటిలోకి సూర్యరశ్మి మరియు గాలి వచ్చే విధంగా నిర్మించాలి. తద్వారా, ఆరోగ్యం పరిరక్షించడి ఆరోగ్య సమాజం ఏర్పాటు కుమార్గం సులభమవుతుంది. ఎయిర్ కండీషనర్లు ఉపయోగం. తగ్గుతుంది.

ప్రకృతి పరంగాలభించే సౌకర్యాలను శాస్త్రీయంగా ఉపయోగించుకునే వైఖరిని ప్రజలలో కలిగించి విటమిన్ డి లోపాన్ని నివారించాలి. లిప్రకృతికి దగ్గరగా జీవించాలి. పకృతికి దగ్గరగా ప్రజలు జీవించే అలవాటు పెంచుకోవాలి. ప్రకృతి రక్షణే జన రక్షణ అనేది నినాదం కాకుండా విధానం కావాలి. సహజ వనరుల సద్వినియోగం తో మానవ వనరుల అభివృద్ధికి పాటుపడే విధానాలను ప్రభుత్వాలు అమలు చెయ్యాలి, జీవన శైలిలో మార్పులు ప్రజలు ఆరోగ్యం కాపాడుకొనుటకు నిత్యవ్యాయామం నడక లేదా సైకిల్ ప్రయాణం జీవనశైలిలో భాగం కావాలి పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛ భారత్ సామాజిక బాధ్యత కావాలి పరిశుభ్రత కు పెద్ద పీట వెయ్యాలి.

హరితహారం పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు ఎక్కువ నిధులు కేటాయించాలి. పర్యావరణ రక్షణను పౌరహక్కుగా పరిగణించాలి. కాలుష్యరహిత వాహనాలను ఉపయోగించాలి. కార్ల వినియోగాన్ని తగ్గించాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణం చేయాలి. తాజా ఆహార ఉత్పత్తులను ఉపయోగించాలి. వాయి కాలుష్యం విధానాలను అనుసరించడం వల్ల వాయు కాలష్యాన్ని అరికట్టవచ్చు. వాహనాల కాలుష్యం అరికట్టుటకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి.

స్వచ్ఛంద సంస్థలు యువజన విద్యార్ధి మహిళా సంఘాలు పొదుపు సంఘాలు అంగన్ వాడి ఆరోగ్య కార్యకర్తలు సూర్యరశ్మి ఉపయోగాలు విటమిన్ డి కొరత నివారణ పట్ల అవగాహన చైతన్య సదస్సులు నిర్వహించి ఆరోగ్యమే మహాభాగ్యము అన్న నినాదాన్ని ప్రజారోగ్య విధాన కార్యచరణగా అమలు చేసి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం ఉపక్రమించాలి.

నేదునూరి కనకయ్య

రాష్ట్ర అధ్యక్షులు

తెలంగాణ ఎకనామిక్ ఫోరం

హైదరాబాద్ 

9440245771

Post a Comment

0 Comments