GET MORE DETAILS

సయాటికాకు హోమియోనే శాశ్వత వైద్యం

 సయాటికాకు హోమియోనే శాశ్వత వైద్యం


ఆధునిక యుగంలో 'సయాటికా' అనే పదం వినని వారుండరు. తుంటి ఎముక నుంచి పాదం దాకా ఉండే ఈ సయాటికా నొప్పి భరించరానిదిగా ఉంటుంది. ఇది దైనందిన జీవితాన్ని కూడా ఆటంకపరు స్తుంది. అయితే సరియైన సమయంలో చికిత్స తీసుకుంటే, ఈ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సమస్య ఎక్కువగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కుల్లో కనిపి స్తుంది.

డాక్టర్ శ్రీకాంత్ మోర్లవర్

Founder Chairman

హోమియోకేర్ ఇంటర్నేషనల్

టోల్ ఫ్రీ : 1800 108 1212

ఉచిత కన్సల్టేషన్ 9550001188/99

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు


సయాటికా నిర్మాణం

మన శరీరంలోకెల్లా అత్యంత పొడవైన నరం సయాటికా నరమే. ఇది వెన్నుపాము నుంచి మొదలై, పిరుదుల గుండా తొడ వెనుక భాగంలోకి, అక్కడి నుంచి పక్కలకు, మరియు పాదాలదాకా వెళుతుంది. సయా టికా నరం పాదాల పనితీరును, స్పర్శను నియంత్రిస్తుంది. ఇది ఐదు ఇతర నరాల సమూహంతో (ఎల్-4, ఎల్-5, ఎస్-1, ఎస్-2 ఎస్-3) ఏర్పడుతుంది. ఈ సయాటికా నరం మీద ఒత్తిడి పడినప్పుడు కలిగే నొప్పినే సయాటికా నొప్పి అంటారు. సయాటికా నరం వెళ్లే మార్గంలో ఎక్కడైనా నొప్పి కలగవచ్చు. దీనివల్ల కాళ్లల్లో తిమ్మిర్లు స్పర్శ తగ్గిపోవడం, మంట, నడకలో మార్పు వంటి లక్షణాలు కని పిస్తాయి.

ఎందుకిలా...?

హెర్నియేటెడ్ డిస్క్

దీన్నే డిస్క్ ప్రొలాప్స్ అని కూడా అంటారు. వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ మృదులాస్థితో తయారవుతుంది. ఇది షాక్ అబ్జర్వర్ పనిచేస్తుంది. వంగడానికి, ఇతర పనులు చేసుకోవడానికి సహాయపడు తుంది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ డిస్కులు బలహీనపడి డిస్కు అంచు అనగా అన్యులస్ ఫైబ్రోసిస్ చిరిగి లోపల ఉండే మెత్తని జిగురు న్యూక్లియస్ పల్పోసిస్ బయ టికి రావడాన్నే హెర్నియేషన్ అంటారు. ఇలా బయటకు వచ్చిన హెర్నియేటెడ్ డిస్క్ నరాల పైన ముఖ్యంగా సయాటికా నరం పైన నొక్కి నప్పుడు కలిగే లక్షణాలను సయాటికా నొప్పి అంటారు.

స్పాండైలోలిస్థిసిస్

వెన్నుపూసలోని ఎముకలు పరిమితికి మించి ముందుకు గానీ, వెనుకకు గానీ జార డాన్ని స్పాండైలో లిస్థిసిస్ అంటారు. కానీ వెన్నుపూసల్లోని ఎముకలను పట్టి ఉంచే లిగ మెంట్లు, సాగడం వల్ల ముఖ్యంగా బరువులు ఎత్తడం, కొన్ని రకాల క్రీడలు ఆడటం వల్ల, లేదా వెన్నెముక ప్రాక్చర్స్ వల్ల ఈ సమస్య వస్తుంది. వయసు పైబడటం వల్ల వెన్నుపూసలు బలహీనప డిన కారణంగా కూడా ఈసమస్య వచ్చే అవకాశం ఉంది.

స్పైనల్ స్టినోసిస్

వెన్నుపూసల లోపల నాళం ఉంటుంది. దీన్నే స్పైనల్ కెనాల్ అంటారు. ఈ నాళం ఇరుకుగా మారడం లేదా మూసుకుపో వడాన్నే స్పైనల్ స్టినోసిస్ అంటారు. ఈ కెనా ల్ లో వెను పాము మరియు ఇతర నరాల సమూహం ప్రయాణిస్తుంది. ఏ కారణం చేత నైనా నడుము భాగంలోని ఈ నాళం ఇరు కుగా మారినట్లయితే వెన్నుపాము పైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల తీవ్రమై నడుము నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు రావడం, మొద్దుబారడం వంటి సయాటికా లక్షణాలతో పాటు మలమూత్రాల విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, కాళ్లు చచ్చుబడటం వంటి లక్ష ణాలు కనిపిస్తాయి. దీన్నే లంబార్ కెనాల్ స్టినోసిస్ అంటారు.

హోమియో కేర్ చికిత్స

హోమియోకేర్ ఇంటర్నేషనల్ జెనెటిక్ కాస్సిటిట్యూషనల్ విధానంతో సయాటికా లక్షణాలు ముఖ్యంగా నొప్పి, తిమ్మిర్లు కండ రాల బలహీనత వంటి లక్షణాలను తగ్గించ డమే కాకుండా సయాటికాకు కారణమైన వెన్నుపూస సమస్యలను తొలగించి చికిత్స ద్వారా వెన్నెముకను దృడం చేసి, సయాటి కాను శాశ్వతంగా తగ్గించడం సుసాధ్యమవు తుంది.

Post a Comment

0 Comments