GET MORE DETAILS

తుపాను అంటే ఏంటి? ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

తుపాను అంటే ఏంటి? ఆ వివరాలేంటో తెలుసుకుందాం.ప్రస్తుతం మిచౌంగ్/మీచోంగ్ తుపాను సంభవించిన నేపథ్యంలో ఆ వివరాలను గురించి ఓసారి పరిశీలిస్తే...

ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా వాతావరణ శాఖ తుపాన్‌లను గుర్తిస్తుంది.

వాతావరణం: భూమి ఉపరితలంపై ఆవరించియున్న వాయుపొరను వాతావరణం అంటారు. సాధారణంగా రుతుపవనాల వల్ల కానీ, తుపానుల వల్ల కానీ వర్షపాతం సంభవిస్తుంది. రెండూ వాతావరణ ప్రక్రియలో భాగమే. అయితే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది.

రుతుపవనాలు: రుతువులను అనుసరించి గాలి వీచడాన్ని, వెనుకకు మరలడాన్ని 'రుతుపవనాలు' అంటారు. రుతుపవనం అనేపదం 'మౌసమ్' అనే అరబిక్ పదం నుంచి ఉద్భవించింది. దీనర్థం రుతువు(Season) నేల, నీటి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాల కారణంగా రతుపవనాలు కదులుతాయి.

రుతుపవన గాలులు సముద్రం మీదనుంచి భూమిపైకి వీచినపుడు వాటితోపాటు తెచ్చే తేమ కారణంగా వర్షాలు కురుస్తాయి.

ఉదాహరణ: నైరుతి రుతుపవనాలు

గాలులు భూభాగం నుంచి సముద్రం వైపునకు వీచేటపుడు చాలావరకు పొడి వాతావరణం ఉంటుంది.

ఉదాహరణ: ఈశాన్య రుతుపవనాలు

ఉపరితల ఆవర్తనం: భూ ఉపరితలంపై 500-1000 మీటర్ల మధ్య ప్రసరించడాన్ని 'ఉపరితల ఆవర్తనం' అంటారు.

ద్రోణి: సముద్రపు నీరు వేడెక్కినపుడు అక్కడి గాలి తేలికగా మారి పైకి వెళుతుంది. అప్పుడు దాని చుట్టూ ఉన్న అధిక పీడన ప్రాంతాల నుంచి గాలులు వీస్తాయి. ఇవి మళ్లీ వేడెక్కి పైకి వెళ్లి చల్లబడి మేఘాలుగా ఏర్పడి వర్షాలకు కారణమవుతాయి. ఈ ప్రక్రియను ద్రోణి అంటారు.

అల్పపీడనం: ద్రోణి స్థిరంగా ఉండకుండా పాకుతుంది. పీడనం తగ్గేకొలదీ తీవ్రత పెరుగుతుంది. దీనిని 'అల్పపీడనం' అంటారు.

వాయుగుండం: అల్పపిడన తీవ్రత పెరిగితే దానిని 'వాయుగుండం' అంటారు. గాలి వేగం గంటకు 31 కి.మీ వరకు ఉంటుంది..

తుపాను: వాయుగుండం బలపడితే దానినే "తుపాను" అంటారు. గాలి వేగం 31-88 కి.మీ వరకు ఉండవచ్చు.

తీవ్ర తుపాను: గాలి వేగం గంటకు 89-117 కి.మీ వరకు ఉంటే దాన్ని తీవ్ర తుపానుగా పరిగణిస్తారు.

అతి తీవ్ర తుపాను: గాలివేగం గంటకు 118-165 కి.మీ వరకు ఉంటే అది అతి తీవ్ర తుపాను.

సూపర్ సైక్లోన్: గాలివేగం తీవ్రత 220 కి.మీ దాటితే దాన్ని "సూపర్ సైక్లోన్" అని అంటారు.

గమనిక:

1) అల్ప పీడనం నేల లేదా సముద్రంలో ఏర్పడవచ్చు కానీ తుపానులు మాత్రం కేవలం సముద్రాలలోనే ఏర్పడతాయి.

2) వర్షాలు అధికంగా సముద్రాలలోనే కురుస్తాయి.

తుపానులను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.

1) కరేబియన్ సముద్రం, మెక్సికో, అట్లాంటిక్ మహా సముద్రాలలో సంభవించే తుపాన్‌లను 'హరికేన్లు' అంటారు.

2) చైనా సముద్రం & ఉత్తర పసిఫిక్ మహా సముద్రాల్లో ఏర్పడే తుపాన్‌లను 'టైఫున్లు' గా పిలుస్తారు.

3) పశ్చిమ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలో వీటిని 'టోర్నడో' లు అని అంటారు.

4) ఆస్ట్రేలియాలో 'విల్లి విల్లీ' గా అభివర్ణిస్తారు.

5) ఉత్తర హిందూ మహా సముద్రంలో వీటికి 'తుపాన్‌లు' అని పేరు.

గమనిక: టోర్నడో, హరికేన్లు చాలావరకు అతి తీవ్ర తుపానులు, కొన్నిసార్లు ఇవి సూపర్ సైక్లోన్స్‌గా మారతాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో సంభావించిన తుపాను తీవ్ర తుపానుగా మారనుంది.

మరి తుపాన్‌లకు ఆ పేర్లు ఎలా పెడతారు...?

ప్రపంచ వాతావరణ సంస్థ, అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆర్థిక, సామాజిక కమిషన్ సభ్యులకు తుపానుల పేర్లను నిర్ణయించే బాధ్యతలు అప్పగించడం జరిగింది.

తుపానుల పేర్లు ప్రాంతీయ చట్టాలపై ఆధారపడి ఉంటాయి. అక్షర క్రమాన్ని అనుసరించి స్త్రీ, పురుషుల పేర్లను ఒకదాని తరువాత మరొకటి పెట్టే కొత్త సాంప్రదాయం 2000 సంవత్సరం నుంచి ప్రారంభమైంది.

తుపానులకు పేర్లను పెట్టే దేశాల జాబితాలో భారత్, బంగ్లాదేశ్, మియన్మార్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, పాకిస్థాన్, థాయిలాండ్ వంటి 8 దేశాలు 8 జాబితాలలో ఒక్కొక్క పేరును సూచిస్తాయి/8×8=64.

2023లో హిందూ మహాసముద్రంలో భాగమైన బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో 6 తుపానులు సంభావించాయి. 6వ తుపాను పేరే ఈ 'మిచౌంగ్'. దీనిని మియన్మార్ దేశం సూచించింది.

ప్రశ్న: వాయుగుండం తీరాన్నితాకడం మరియు తీరాన్ని  దాటడం మధ్య తేడా ఏమిటి ?

జవాబు: తుపాను సముద్రం నుంచి ఏదో ఒక చోట భూభాగాన్ని తాకితే అది 'తీరాన్ని తాకడం' అని, పూర్తిగా భూభాగం మీదికి వస్తే 'తీరాన్ని దాటడం' అని అంటారు.

తుపాను సముద్రంలో ఉన్నంత వరకు బలంగా ఉంటుంది. తీరం దాటగానే బలహీన పడుతుంది. ఈ సమయంలో అధిక వర్షాలు కురుస్తాయి.

ప్రశ్న: తుపాను వరద మధ్య తేడా ఏమిటి ?

జవాబు: నీటి పరిధి దాటి నేలపై ప్రవహించడాన్ని 'వరద' అంటారు. రుతుపవన వర్షాలు, తుపానులు, పెద్ద మొత్తంలో మంచు కురవడం, సునామి, వీటిలో ఏదైనా కారణంతో వరదలు సంభవించవచ్చు.

అల్ప పీడన ప్రాంతం, అధిక పీడన ప్రాంతం నుంచి చుట్టుముట్టిన గాలులను తుపాను అంటారు.

ప్రశ్న: సునామి, టైడల్ వేవ్స్, ఉప్పెన మధ్య తేడా ఏమిటి ?

జవాబు: సునామి నీటి అడుగున భూకంపం లేదా కొండచరియలు విరిగిపడటం, అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల సంభవించే సముద్రపు అలను 'సునామి' అంటారు.

పోటు పాటు: సూర్యచంద్రుల గురూత్వాకర్షణ వలన సముద్రపు అలలు ఎగసి పడడాన్ని 'పోటు పాటు' అంటారు.

ఉప్పెన: సముద్రానికి పోటు వచ్చిన సమయంలోనే తుపాను సంభవిస్తే ఆ రెండిటి ప్రభావానికి పల్లపు ప్రాంతాలు మునిగి పోవడాన్ని 'ఉప్పెన' అంటారు.

Post a Comment

0 Comments