ఉసిరి ఎంత మంచిదంటే...
చలికాలంలో లభించే ఉసిరి ఆరోగ్యానికి దివ్యౌష ధంగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీనితోపాటు ఐరన్, కాల్షియం, పాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పచ్చడి, మురబ్బా, క్యాండీ, జ్యూస్.. ఇలా ఏ రూపంలో తీసు కున్నా ఆరోగ్యానికి మంచిదే. ఉసిరి కాయలు నేరుగా కూడా తినేయొచ్చు. డ్రై ఆమ్లా క్యాండీలు కూడా! చప్పరించేయొచ్చు.
» గొంతు మంట, జలుబుతో బాధపడేవారు. 2 టీస్పూన్ల ఉసిరి పొడి, 2 టీస్పూన్ల తేనె కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
» ఇందులో ఉన్న పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది.
» రోజూ పరగడుపున ఉసిరి రసం పుక్కిలించడం ద్వారా నోటిలో వచ్చే పుండ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, ఫ్లూ వంటి సమస్యలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
» ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పుల నివారణకు ఎండు ఉసిరి ఉపయోగపడుతుంది.
» రోజువారీ ఆహారంలో ఉసిరి ఉండేలా చూసు కుంటే బరువు తగ్గడంతో పాటు జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.
» దీనిలో ఉండే ఔషధ గుణాల వల్ల ఇది సహజసి ద్ధమైన కండిషనర్ గా పనిచేస్తుంది. ఉసిరి నూనె వాడకం జుట్టు తెల్లబడటాన్ని తగ్గించడంతోపాటు ఆరోగ్యవంతమైన కేశసంపదను అందిస్తుంది. కుదుళ్లకు తగిన బలాన్నిచ్చి జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది.
» తరచూ ఉసిరిని ఆహారంలో తీసుకుంటే ఆరో గ్యంతో పాటు చర్మానికి మంచి మెరుపు వస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బ్లడ్ షుగర్ను అదు పలో ఉంచుతుంది.
» ఉసిరి రసం రోజూ తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గి, గుండె పనితీరు మెరుగు పడుతుంది.
» శరీరం నుంచి చెడు టాక్సిన్లను బయటకు పంప డానికి ఉసిరి రసం సహాయపడుతుంది.
0 Comments