పొడిబారిన చర్మానికి ఆముదం...!
జుట్టు పెరిగి, పట్టుకుచ్చులా మారేందుకు ఆము దాన్ని వాడుతుంటాం. ఇది కేవలం తలకే కాదు.. చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది. ఎలాగో తెలుసా...!
కొందరికి ముఖంపై అక్కడక్కడా మచ్చ లుంటాయి. వయసురీత్యా వచ్చే ఈ మచ్చల్ని కనిపించకుండా చేయాలంటే... కొద్దిగా ఆముదాన్ని తీసుకుని మచ్చలున్న చోట మృదువుగా మర్దన చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ఫలితం! ఉంటుంది.
◾గోళ్లు పొడిబారి, వాటి మధ్యలో గీతలు పడ్డాయా? రాత్రిళ్లు పడుకునే ముందు గోళ్లకు ఆముదాన్ని రాసి చూడండి.
◾స్నానానికి వెళ్లేందుకు పదిహేను నిమిషాల ముందు ముఖానికి ఆముదాన్ని రాసుకుని మృదువుగా మర్దన చేయాలి. తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది మృతకణాల్ని తొలగించడం. తోపాటూ చర్మాన్ని తాజాగా మారు స్తుంది.
◾కాలంతో సంబంధంలేకుండా కొంద రికి పాదాల పగుళ్లు ఇబ్బంది పెడుతుం టాయి. ఇలాంటివారు రాత్రిళ్లు పడుకునే ముందు అరిపాదాలకు గోరువెచ్చగా చేసిన ఆముదాన్ని రాసుకోవాలి. మర్నాడు కడిగేసి నాణ్యమైన మాయిశ్చరైజర్ని రాసుకోవాలి.
◾వయసు పెరిగేకొద్దీ ముడతల సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య ఉన్నచోట ఆముదాన్ని రాసి అరగంట అయ్యాక కడి... గేయాలి. వారంలో ఇలా మూడుసార్లు ఇలా చేస్తే మంచిది.
◾పెదవులు పొడిబారి, పగిలినట్లు అవుతున్నాయా.. వాటికి కొద్దిగా ఆముదాన్ని రాసి చూడండి. ఆ సమస్య తగ్గడమే కాదు, పెదవులూ మృదువుగా మారతాయి.
0 Comments