GET MORE DETAILS

ఆలివ్ నూనె తో ఎన్ని లాభాలో...!

 ఆలివ్ నూనె తో ఎన్ని లాభాలో...!



పదార్ధాల తయారీలో ఆలివ్ నూనె వేసుకుంటే.. ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి సమృద్ధిగా అందు తాయి. కేవలం ఆరోగ్యానికే కాదు. ఆలివూనె మరి కొన్ని లాభాలూ అందిస్తుంది. అవేంటో చూసేయండి.

ఆలివ్ నూనె సహజ మాయిశ్చరైజర్ పనిచే స్తుంది. ఇది జుట్టు చివర్లు చిట్లే సమస్యను కూడా పరిష్కరిస్తుంది. ఏం చేయాలంటే.. గుడ్డులోని తెల్లసొనలో ఆలివ్ నూనెను కలిపి తలకూ, జుట్టు చివర్లకూ పట్టించాలి. ఒకవేళ జుట్టు పొడిబారి ఉన్నట్లయితే గుడ్డులోని పచ్చసొనలో రెండు టేబుల్స్పూన్ల ఆలివ్ నూనె కలిపి తలకు రాయాలి. అరగంట అయ్యాక. షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

స్నానం చేసే నీటిలో రెండుమూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెను వేసుకోండి. ఈ నీటితో స్నానం చేశాక తువ్వాలుతో తడిపోయేలా అద్దుకుంటే చాలు. చర్మం మృదువుగా మారుతుంది.

మనం వాడే మేకప్ బ్రష్లను ఎన్నిసార్లు షాంపూతో కడిగినా సరిగ్గా శుభ్రపడకపోగా వాటి నుంచి నీరు కారుతుంటుంది. రెండు వంతుల యాంటీబ్యాక్టీరియల్ లిక్విడ్సోప్లో ఒక వంతు 

 వనూనె కలపండి. ఇందులో బ్రష్ లను ముంచి రెండు నిమిషాలయ్యాక తీసేయండి. ఆ బ్రష్లకు పట్టిన మురికీ, మేకప్ సులువుగా ఇవతలకు వచ్చేస్తుంది. కాసేపయ్యాక నీళ్లతో కడిగేస్తే చాలు.

ముఖానికి వేసుకున్న మేకప్, రిమూవర్ తోనే తొలగించాలని లేదు. ఆలివ్నూనెలో దూదిని ముంచి, దాంతో ముఖం తుడుచుకోండి. ఇది మేకప్ని పూర్తిగా తొలగించడమే కాదు. చర్మానికి తేమనూ అందిస్తుంది.

అదేపనిగా నీళ్లలో నడవడం, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల అరిపాదాల పగుళ్లు వేధిస్తుంటాయి. ఇలాంటప్పుడు ఓ పని చేయండి. రాత్రిళ్లు నిద్రపోయే ముందు అరికాళ్లకు ఆలివ్నూనె రాసుకుని మృదువుగా మర్దన చేసి సాక్సులు వేసుకోండి. ఇలా రోజూ చేస్తుంటే. క్రమంగా ఆ సమస్య అదుపులోకి వస్తుంది. పాదాలూ మృదువుగా మారతాయి.

కనురెప్పలు కొందరికి పల్చగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలివూనెను రాత్రిళ్లు పడుకునే ముందు. కొద్దిగా ఆ రెప్పలకు అద్దుకుంటే చాలు. క్రమంగా నిండుగా మారతాయి. ఈ చిట్కా కనుబొ మలకూ వర్తిస్తుంది.

Post a Comment

0 Comments