వ్యాయామానికీ ప్రణాళిక...!
ప్రసవం తర్వాత ఓ వైపు పాపాయి అవసరాలూ, వ్యక్తిగత ఆరోగ్యం, విధులు ఇలా కొత్తగా తల్లులైనవారికి ఎన్నో సవాళ్లుంటాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటూనే వ్యాయామం చేయాలి కాబట్టి.. దానికీ కాస్త ప్రణాళిక పెట్టుకోండి.
• ఉదయం పూట వ్యాయామం చేయడానికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు సాయంత్రమే చేయండి. లేదా పది పది నిమిషాల చొప్పున కుదిరినప్పుడల్లా చేయండి.
• కాసేపు విశ్రాంతి తీసు కునే సమయం దొరికిందను కోండి.. తాడాట ఆడండి. చిన్నచిన్న వేయండి. ఆసనాలూ
• ఈ రోజుల్లో ఇరవై నిమి షాల్లో పూర్తిచేసే వ్యాయా మాలు, పది నిమిషాల్లో చేసేవి యాప్ ద్వారా మనకు అందుబాటులో ఉంటున్నాయి. అవి ఫోనులో పెట్టుకుంటే గనుక.. కుదిరినప్పుడు చేయొచ్చు.
• ఒక్కోరోజు ఎంత ప్రయత్నించినా వ్యాయామం చేసే తీరిక ఉండ కపోవచ్చు. అలాంటప్పుడు మెట్లు ఎక్కి దిగేలా చూసుకోండి. కొద్ది దూరానికే స్కూటీనీ వాడకుండా నడవండి. ఆ రోజు వ్యాయామం చేయని లోటుని ఇలా పూడ్చండి.
• మీరు నడక, పరుగు లాంటివి వ్యాయామంగా ఎంచుకుంటే.. ఒక్కరే కాకుండా భాగస్వామినీ వెంట తీసుకెళ్లేలా చూడండి. వ్యాయామం పూర్తవుతుంది. అనుబంధమూ పెరుగుతుంది
0 Comments