GET MORE DETAILS

కళ్లు మిలమిలలాడేలా...

 కళ్లు మిలమిలలాడేలా...



కళ్లు ఎంత ఆకర్షణీయంగా ఉంటే ముఖం అంత వెలిగిపోతుంది. ఎలాంటి అలంకరణ లేకుండానే అందమైన కళ్లు మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా...

👁️‍🗨️ కళ్ల అడుగున చర్మం బిగుతుగా ఆరోగ్యంగా కనిపించేలా చూసుకోవాలి. ఇందుకోసం విట మిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకో వడం మంచిది.

👁️‍🗨️ కనుబొమలను ఎప్పుడూ మంచి ఆకృతి వచ్చేలా చూసుకోవాలి. సొంతంగా ప్రయో గాలు చేయకుండా నిపుణుల దగ్గరకెళ్లి వాటిని దిద్దుకోవాలి.

👁️‍🗨️ తగినంత విశ్రాంతి లేకపోతే కళ్లు ఉబ్బి, కాంతి విహీనంగా మారతాయి. అందుకే వాటికి వీలైనంత ఎక్కువ విశ్రాంతినివ్వాలి.

👁️‍🗨️ కంటి చుట్టూ ఉన్న చర్మానికి తేమ అందేలా ఏదయినా మాయిశ్చరైజర్ని రాసుకోవాలి. అప్పుడే వాటిచుట్టూ ముడతలూ, గీతలూ, వలయాలు రాకుండా ఉంటాయి.

👁️‍🗨️ కళ్లు అలసిపోయినపుడు కంట్లో వేసుకునే చుక్కలు వాడాలి. ఇవి ఎరుపుదనాన్ని తగ్గించి, మెరిసేలా చేస్తాయి. కళ్లకు చల్లదనాన్ని ఇచ్చే కీరదోస, చల్లటి గ్రీన్ టీ బ్యాగులూ, ఐసుముక్కలను కళ్ల మీద పెట్టుకుంటూ ఉండాలి.

👁️‍🗨️ వ్యాయామం కూడా కళ్లకు మేలు చేస్తుంది. అప్పుడప్పుడూ వాటిని గుండ్రంగా తిప్పడం, కుడి ఎడమలవైపు కళ్లను తిప్పడం, ఎదురుగా చూపుడువేలు వాటి ఎదురుగా పెట్టి.. సూటిగా దాన్నే చూడటం లాంటివన్నీ అలసిన కళ్లకు సాంత్వన అందిస్తాయి.

Post a Comment

0 Comments