GET MORE DETAILS

జాగింగ్ తో లాభాలెన్నో...

 జాగింగ్ తో లాభాలెన్నో...



ప్రతి రోజూ ఉదయం కాసేపు జాగింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఉదయాన్నే ఒళ్లు చెమటలు పట్టేలా జాగింగ్ చేయగలిగితే ఆరోగ్యం బాగుంటుందంటున్నారు. అమ్మో... చలిలో పెందరాళే లేవడం మావల్ల కాదంటారా..! అయితే జాగింగ్ వల్ల కలిగే ప్రయోజనా లేమిటో తెలుసుకుంటే బద్ధకాన్ని వదిలేసి జాగింగ్ బాట పడతారు.

◾కొవ్వు కరిగించడంలో జిమ్లు, డాక్టర్లు చేయలేని పని జాగింగ్ చేయగలదు. ప్రతి ఉదయం మూడు కిలోమీటర్లు జాగింగ్ చేసి చూడండి. ఎముకలు, కండరాలు ఫిట్గా తయారవుతాయి. మూడునెలలు రెగ్యులర్గా జాగింగ్ చేస్తూ, హెల్దీ డైట్ మెయిం టేన్ చేస్తే బరువు తగ్గి ఆరోగ్యంగా కనిపిస్తారు. మానసిక ఒత్తిళ్లు సైతం దూరమవుతాయి.

◾జాగింగ్ కాకుండా మామూలుగా నడిచినా రక్తకణాలు చురుకుగా కదులుతాయి. దీంతో మెదడకు రక్తసరఫరా సాఫీగా సాగు తుంది. ఫలితం మీ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. రక్తసర ఫరా మెరుగవడం వల్ల హైపర్ టెన్షన్, గుండెకు సంబంధించిన అనారోగ్యాలు దరి చేరవు.

◾జాగింగ్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం మంచి నిద్ర, ఉదయం. చేసే ఈ చిన్నపాటి వ్యాయామం రాత్రుళ్లు మిమ్మల్ని ప్రశాతంగా నిద్రపోయేలా చేస్తుంది. రోజంతా మెదడు ఆరోగ్యకరంగా పనిచే యడం మూలాన రాత్రివేళలో కునుకు ఇట్టే వచ్చేస్తుందట. పైగా.. ఉదయాన్నే ఆటోమెటిగ్గా నిద్ర లేచేందుకు మనసు సన్నద్ధం అవుతుందట కూడా.

◾డయాబెటిస్ ఉన్నవాళ్లలో షుగర్ లెవల్డ్స్ను కంట్రోల్ చేయడానికి జాగింగ్ను మించిన ఔషధం లేదు. యువత జాగింగ్ను నిత్య కృత్యంగా మలుచుకుంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు నూటికి 90 శాతం తగ్గిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments