GET MORE DETAILS

చలి బాధలకు దూరంగా...

 చలి బాధలకు దూరంగా...



చలికాలంలో దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ల బారినపడటం, ఒంట్లో గట్టిదనం లేకపోవటం, నొప్పులు, లాంటివి వేదిస్తాయి. ఇలా చలిబారిన పడి ఇబ్బంది పడకుండా ఉండా లంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

◾విటమిన్ సీ, జింక్ ఉండే నారింజ లాంటి సిట్రస్ పండ్లు తింటే శరీరంలో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశం తక్కువ..

◾చలికాలం వచ్చిందని గడ్డకట్టుకున్నట్లు ఒకేచోట కూర్చుని ఉండిపోకూడదు. రక్తప్రసరణ సరైన రీతిలో ఉండటానికి వ్యాయామాలు చేయాలి. శరీర బరువునూ కంట్రోల్ చేసుకోవాలి.

◾న్యూట్రియన్లు ఉండి, వ్యాధినిరోదక శక్తిని పెంచే గుణం కూరగాయలు, పండ్లకు ఎక్కువుంది. అందుకే సీజనల్ ట్తో పాటు కూరగాయలు తినాలి.

◾కొందరు చలికాలంలో దప్పికగా లేదని అంటుంటారు. అలా చేస్తే ఇబ్బందని నిపుణులు అంటున్నారు. అందుకే నీటిని బాగా తాగటం వల్ల దురదలాంటి చర్మ సమస్యలు దరికి రాకుండా ఉంటాయి.

◾చర్మసంబంధ వ్యాధులు రాకుండా శుభ్రంగా ఉండాలి.. ఉన్ని దుస్తులు ధరించాలి. శరీరం వెచ్చగా ఉండేట్లు చూసుకోవాలి.

◾చలికాలంలో ముఖం, కాళ్లు, చేతులు త్వరగా పొడిబారు తాయి. అందుకే కొబ్బరినూనె, పెట్రోలియం జెల్లీ లాంటివి చర్మానికి రాసుకోవటం మంచిది.

Post a Comment

0 Comments