శారీరక శ్రమతో మెదడుకు ఆరోగ్యం
🩸 శరీరానికి తగినంత శ్రమ కల్పించే వారి మెదడు ఆరోగ్యంగా ఉంటుందని వెల్లడైంది. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయల సలాడ్స్ తీసుకుంటే మెదడు పనితీరు మెరుగవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
🩸 ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా మెదడును ప్రభా వితం చేస్తుందంటున్నారు. దీనిద్వారా లక్ష్యాలను సాధించడం, సమస్య లను పరిష్కరించడం, స్వీయ నియంత్రణ వంటి లక్షణాలు అలవడు తాయని పేర్కొంటున్నారు.
🩸 రోజూ వ్యాయామం చేయడంతో పాటు ప్రాసె నెడ్ ఫడ్ను తక్కువగా తీసుకోవడం వల్ల వయసు పెరిగినా ఆ ప్రభావం మెదడుపై ఉండదు.
🩸 వృద్ధుల్లో బుద్ధి మందగించడానికి తగిన శారీరక శ్రమ లేకపోవడం కూడా ఒక కారణం. పొగ తాగడం. అతిగా మద్యం సేవించడం వంటి అలవాట్లు మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
0 Comments