GET MORE DETAILS

ఆకుకూరలు - ఆరోగ్యానికి మేలు

 ఆకుకూరలు - ఆరోగ్యానికి మేలు 



• వారంలో నాలుగు రోజులైనా తినాలి

• రోగ నిరోధక శక్తిని పెంచుతాయి

ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందించేవి ఆకుకూరలు. విటమిన్లు, పోషక పదార్థాలు కావాల్సిన వారు వాటిని తప్పనిసరిగా తీసుకోవాలి. పోషకాహార లోపం తో బాధపడే వారికి ఆకుకూరలు ఔషధంలా చేస్తాయని వైద్యులు లు పేర్కొంటున్నారు. పిల్లలు, యువత జంక్పుడ్కు అలవాటు పడి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యం లో ఆకుకూరలు, వాటిలో ఉండే పోషకాలు ప్రాధాన్యతను జిల్లా ఆర్ బీఎస్ వైద్యులు టి. ప్రభాకర్ వివరించారు. సంపూర్ణ ఆరోగ్యం వారంలో నాలుగు రోజుల పాటు ఆకుకూరలను తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు రోజు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. లేకుంటే వారానికి నాలుగు రోజులైనా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి సం పూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మిటమిన్లు, మినరల్స్, పొటాషియం, కాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు అందుతాయి.

పుదీన: పుదీన ఆకు సుగంధభ రితమైనది. దీనిని తినడం ద్వారా మెద డులో చురుకుదనం పెరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపొందించే శక్తి పుదీన ఆకుకు ఉంది. ఈ ఆకును నీటిలో కలిపి స్నానం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

చింత చిగురు: చింత చిగురును మాంసం ప్రియులు అమితంగా ఇష్టపడతారు. చిం త చిగురు కలిపి వండే మాంసాహార వం టకాలు రుచికరంగా ఉంటాయి. చింతచి గురు కాంబినేషన్ తో చేసే వంటకాలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్-సీ అధికంగా ఉండడం వల్ల రక్త శుద్ధితో పాటు కాలేయానికి పుష్టినిస్తుంది.

ముల్లంగి ఆకు: ముల్లంగిలో ఆకు కంటే దుంపకే అధికార ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆకును కూడా. కూరగా తయారు చేసుకుం టారు. ముల్లంగి ఆకు సర్వరోగ నివారణకు పని చేస్తుం ది. విరేచనాలకు విరుగుడుగా ఉపయోగపడుతుంది.

గోంగూర: ఆకుకూరల్లో గోంగూరకు ఉన్న ప్రాధాన్యం ఇంక దేనికీ లేదు. తెలుగు వారికి గోంగూర మీద మక్కువ గురించి ఇతర దేశాల్లో కూడా చెబుతుం టారు. మంచి రుచితో పాటు దీర్ఘకాలిక రోగాలను బాగు చేసే శక్తి గోంగూరలో ఉంటుంది. రక్త ప్రసనరణకు ఔషధంలా పని చేస్తుంది.

మెంతికూర: శరీరానికి సంబంధించి అనేక ఆనారోగ్య సమస్యలు నివారించడంలో మెంతికూర అత్యుత్తమం గా పని చేస్తుంది. సుగర్ వ్యాధి. లోబీపీని నియంత్రిం చేందుకు ఉపయోగపడుతుంది. మెంతి ఆకులు రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయమే తాగితే సుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. లివర్ సమస్య, గాస్ట్రిక్, శాశ్వకోస వ్యాధులు నివారణకు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో మెంతు ఆకులు ఎంతో ఉప యోగపడుతాయి.

చుక్కకూర: నిద్రలేమి, రక్తపోటు, రక్తహీనతకు రోగ నిరోధకశక్తి పెంచేందుకు, సుగర్వ్యాధి తగ్గించేం దుకు ఇది ఉపయోగ పడుతుంది. నెలలో ఒకసారి అయినా దీనిని తింటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఐరన్, విటమిన్ ఏ, సీ చుక్కకూరలో ఉంటాయి.

కొత్తిమీర: చక్కని సువాసన, కమ్మని రుచి కొత్తిమీర సొం తం. దీనిలో విటమిన్లు ఏ, సీ, ఈ కే లతో పాటు అనేక రకాల పోషకాలున్నాయి. ఇది శరీరం లోకి అవసరమైన ఆయిల్స్ రక్తంలోని సుగర్ లెవెల్స్ కంట్రో ల్లో ఉంచుతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది.

మునగాకు: మునగాకు రసం తాగినా, వేపుడు తిన్నా ఆరోగ్యానికి మంచిది. కాల్షియం లోపం, రక్తహీనత ఉన్న వారికి ఈ ఆకు మేలు చేస్తుంది.

తోటకూర: గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా వాడకం లో ఉండే ఆకుకూరల్లో తోటకూర ప్రధానమైనది. రక్తం పెరగడానికి, శుద్ధి చేసేందుకు తోట కూర ఎక్కువగా ఉపయోగపడుతుంది.

బచ్చలికూర: బచ్చలి కూరలో పోషకాలతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటి ముడి ఖని జాలు ఉంటాయి. ఏ. బీ-1, బీ-2, బీ-6, సీ విటమిన్లు అధికంగా ఉంటాయి. శ్వాస సంబం ధిత సమస్యల నుంచి ఉపశమనం కల్గిస్తుంది.

పాలకూర: పాలకూర కంటివ్యాధుల నివారణకు పని చేస్తుంది. ఇది తినడం అల వాటు చేసుకుంటే కంటికి సం బంధించిన సమస్యలు దూరమవుతాయి. రక్తహీనత బారి నుంచి బయటపడొచ్చు.

Post a Comment

0 Comments