అసిడిటీని తగ్గించుకోండిలా...
అసిడిటీ అంటే పొట్ట యొక్క ఎగువ భాగంలో అసౌ కర్యం లేదా నొప్పి కలగడం. ఇది సాధారణంగా భోజనం తీసుకున్న వెంటనే సంభవిస్తుంది. దీనివలన ఆకలిని కోల్పోవడం జరిగుతుంది. దానితో పాటుగా శ్రేనుపులు రావడం మరియు అపానవాయువులు వంటివి ఏర్పడ తాయి. మలబద్ధకం లేదా అతిసారం లక్షణాల చేత నోటిలో ఆమ్ల రుచితో కడుపు గడబిడగా ఉంటుంది.
అసిడిటీ అనేది చాలా మందికి సర్వ సాధారణ సమస్య. ఛాతి స్థానంలో మంటతో కూడిన బాధగా ఉండిపోతుంది. ఆహార మార్గంలో పుల్లటి భావన కల గుతూ ఉంటుంది. అసిడిటీ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఇది ఎన్నో ఇతర తీవ్రమైన ఆరోగ్య సమ స్యలకు దారి తీయవచ్చు. నిర్లక్ష్యం చేయడం వలన ఆహార వాహిక ముఖద్వారాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి.
అసిడిటీకి కారణాలు
కడుపు కవాటము సరిగా పనిచేయకపోతే ఆమ్లాలు కడుపు నుండి తిరిగి వెనక్కి నోటి వరకు చేరుకొని ఆసి డిటీ చోటు చేసుకుంటుంది. అధిక బరువు, భోజనం తర్వాత వెంటనే నిద్రపోవడం, ఎక్కువగా తినడం, వేయించిన ఆహారాలు తినడం, ఎక్కువగా మద్యం సేవించడం, ఒత్తిడి మరియు గర్భం వంటివి ఈ సమ స్యకు దారితీసే ప్రధాన కారణాలు, అసిడిటీ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు:
అర గ్లాసు కలబంద రసం తాగడం.
ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సెడార్ ను నీటితో కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం అందిస్తుంది. ఒక అర కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలిపి తీసుకోవడం కూడా చాలా సమర్థవం తంగా పనిచేస్తుంది.
సోంపు
అసిడిటీ వలన ఛాతిలో సంభవించే మంటని తగ్గిం చడానికి సోంపు ఎంతో ఉపయోగకారిగా పని చేస్తుంది. అజీర్తి బాధని నివారించడానికి సోంపు మరింత పటిష్టంగా పోరాడుతుంది. సోంపు టీ గా చేసుకుని సేవించడం వలన హృదయ ప్రాంతంలో మంటని నివారించడంతో పాటుగా అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని క్రమంగా అదుపు చేస్తుంది. మీరు అజీర్ణం మరియు సంబంధిత సమస్యలను నివారించడానికి భోజనం తర్వాత ఒక టీస్పూన్ సోంపు నమబడం ద్వారా సులభంగా జీర్ణం చేసుకోవచ్చు.
దాల్చిన చెక్క
మనం సాధారణంగా ఉపయోగించే సుగంధాల్లో దాల్చిన చెక్క ఒకటి. దీనిని ఆమ్ల వ్యతిరేక లక్షణాలు గల సహజ వనరుగా పేర్కొనవచ్చు. శరీరంలో శోషణ స్థాయిలు, జీర్ణక్రియ రేటును మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. ఒక ఇంచు పరిమాణ దాల్చిన చెక్కని కొంత నీటిలో పది నిముషాల పాటూ మరి గించి ఆ నీటిని రోజు వారీగా సేవించడం వలన పేగులలో ఉండే ఇన్ఫెక్షనన్లు నివారించబడి జీర్ణ వ్యవస్థ మెరుగు పరచబడుతుంది.
ఉల్లిరసం
ఈ నివారణా మార్గం నిజంగా అద్భుతమైనది. ఉల్లి రసం యాసిడ్ లతో పోరాడి నివారించే గృహ చిట్కాలలో మొదటి స్థానంలో ఉంటుందని చెప్ప వచ్చు. ఉల్లిపాయలు ఇన్సులిన్ ను కలిగి ఉండటంలో పేరుగాంచాయి. ఈ జీర్ణ సంబంధ పీచు పదార్ధాలు మానవ ప్రేగులలోని ఆరోగ్యకరమైన బాక్టీరియా మంచి ఆహార పంపిణీ దారులుగా పెర్కొనబడతాయి. తద్వారా ఈ ఆరోగ్యకరమైన బాక్టీరియా అభివృద్ధి జీర్ణ వ్యవస్థని మెరుగు పరిచి అసిడిటీ నివారణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
కలబంద రసం
ఆలోచేరా అసిడిటీ సంబంధిత సమస్యల నివార ణలో ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. మీరు మీ ఆసి డిటీ సమస్యని శాశ్వతంగా నివారించుకోవాలని భావిస్తున్నట్లయితే మీరు తప్పనిసరిగా ప్రతీ రోజు మీ భోజననానికి ముందు కలబంద రసాన్ని సేవించాలి.
క్యాబేజీ రసం
అసిడిటీ నివారణలో ఉపయోగపడే సహజ ఉపకర నముగా నేడు మార్కెట్లో క్యాబేజీ ఎంతో విరివిగా లభించే అత్యంత ముఖ్యమైన కూరగాయ. మీరు క్యాబేజీని ముక్క లుగా తరిగి మిక్చర్లో వేసి రసం తీసి ప్రతీరోజు సేవించడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది.
తేనె
తేనె ప్రతి ఇంటిలో తప్పని సరిగా ఉండాల్సిన ఒక సహజ ఔషధమనే చెప్పాలి. తేనె కొన్ని విలువైన ఔషధ లక్షణాలను కలిగి ఉన్నది. ఇది ఆహారకోశం యొక్క గోడల లైనింగ్ను ధృడ పరుస్తుంది. ఇందు కోసం మీరు ప్రతీ రోజు నిద్రపోవడానికి ముందు రెండు టీ స్పూన్ల తేనె తీసుకోవాలి.
అల్లం
కొంచెం అల్లం తీసుకుని దాని నుండి రసాన్ని తీసి, దానిలో ఒక స్పూన్ నిమ్మరసాన్ని కలిపి సేవించడం ఎంతో ఉపకారినిగా ఉంటుంది.
బొప్పాయి
బొప్పాయిని భోజనం తర్వాత తీసుకోవడం జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్ పాపెయిన్ ప్రోటీన్లను కరిగించడంలో సహాయపడుతుంది.
అరటి పండ్లు
అరటి పండ్లలో ఉండే పొటాషియం యాసిడ్ ఉత్పత్తిని పరిమితి చేస్తుంది. అధిక శ్లేష్మమును క్రమబద్ధీకరించి హానికరమైన ప్రభావాల నుండి రక్షణ కల్పిస్తుంది. అరటి పండులోని పీచుపదార్ధాలు మలబద్దకాన్ని నివారించడంలోను, అసిడిటీని నివారించడంలో మంచి ఉపకారిగా ఉంటుంది.
తులసి
తులసి ఆకులు పొట్టలోని శేషు ఉత్పత్తిలో సహాయపడతాయి. ఇవి పొట్టలో ఏర్పడే హానికర రసాయనాల నుండి రక్షణ కల్పించే వాటిగా ఉపయోగపడతాయి. కొన్ని తులసి ఆకులు ప్రతిరోజూ క్రమంగా తీసుకోవడం వలన ఎగువ ఉదరంలో మంటని, అసౌకర్యాన్ని తగ్గించడంలో మంచి ఫలితాలను పొందుతారు.
ఉసిరి
ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం ఉసిరి కఫము, పిత్త దోషాలను శాంతపరుచుటలో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది, ఉసిరి కాల్షియమ్ వనరులను పుష్కలంగా కలిగి ఉంది. గ్లాసు నీటిలో ఒక చెంచా ఉసిరి పౌడర్ని రోజుకి రెండు సార్లు తీసుకోండి.
బెల్లం
అసిడిటీ నుండి ఉపశమనం పొందడానికి భోజనం తరువాత ఒక చిన్న బెల్లం ముక్కని సేవించండి.
కొబ్బరి నీళ్ళు
కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వలన తక్షణమే శరీర వ్యవస్థ చల్లర్చబడి ఛాతిలో మంటని మరియు ఆసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
దానిమ్మ
దానిమ్మ పండ్ల రసము కూడా ఛాతిలో మంట మరియు ఆసిడిటీ నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే గుమ్మడికాయ, వెల్లుల్లి, పసుపు, పుచ్చకాయ, దోసకాయ, మజ్జిగా వంటివి అసిడిటీని నివారించడంలో బాగా ఉపయోగపడతాయి. ఉదరసమస్యల నుండి ఉపశమనం పొందడానికి జీర్ణవ్యవస్థ అభివృద్ధికి అద్భుతంగా పనిచేస్తాయి.
0 Comments