GET MORE DETAILS

నమస్కారం విలువ.

నమస్కారం విలువ.



మహాభారత యుద్ధ సమయంలో "మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు" అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడి భీష్మ పితామహడు "నేను రేపు పాండవులను చంపుతాను" అని ప్రకటించాడు.

అంతే... పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి, చెడు భయంతో కలవరపడ్డారు. అప్పుడు.. శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు.

తను బైటే నిలబడి ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన "అఖండ సౌభాగ్యవతీ భవ" అని ఆశీర్వదిస్తాడు. తర్వాత జరిగేది గమనించు అన్నాడు.

ద్రౌపది అలానే చేసింది, భీష్ముడు దీవించి, "ఏంటమ్మా! ఇంత రాత్రి ఒంటరిగా వచ్చారు. నిన్ను కృష్ణుడు తీసుకు వచ్చాడు కదా" అన్నాడు.

దానికి ద్రౌపది "అవును తాతయ్యా.. అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు" అనింది. భీష్ముడు బయటకు వెళ్ళగా.. ఇద్దరూ ఒకరికి ఒకరు నమస్కరించుకున్నారు.

వెంటనే భీష్ముడు.. నాకు తెలుసు కృష్ణా, మీరు ఇలా చేస్తారని. ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ప్రభావం ఎక్కువ. నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి అని ఒక మార్గం ఉపదేశించాడు.

శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు".

"ఇలాగే.. నీవు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలకు నమస్కరిస్తూ ఉండు. అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడి భార్యలు కూడా ఆ పెద్దలతో పాటు పాండవులకు కూడా నమస్కరిస్తూ ఉంటే బహుశా ఈ యుద్ధం ఆగిపోవచ్చు. ఒక్క నమస్కారానికి అంతటి భాగ్యం కలుగుతుంది" అన్నాడు.

ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరి నొకరు గౌరవించుకోక పోవడం. అహంకారం వదిలి, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన అనర్ధాలు జరుగుతున్నాయి.

ఇంటిలోని పిల్లలు మరియు కోడళ్లు ప్రతిరోజూ ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దల ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి.

ఎందుకంటే...

• నమస్కారం ప్రేమ.

• నమస్కారం క్రమశిక్షణ.

• నమస్కారం చల్లదనం.

• నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది.

• నమస్కారం మంచి ఆలోచనలను ఇస్తుంది.

• నమస్కారం సంస్కారాన్ని నేర్పుతుంది.

• నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.

• నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.

ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ ప్రతిభ ఇనుమడిస్తుంది.

Post a Comment

0 Comments