GET MORE DETAILS

YouTube: యూట్యూబ్‌లో ఇక కామెంట్లను పాజ్‌ చేయొచ్చు.

 YouTube: యూట్యూబ్‌లో ఇక కామెంట్లను పాజ్‌ చేయొచ్చు.



ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) కంటెంట్‌ క్రియేటర్ల కోసం కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ‘pause’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ సాయంతో పాత కామెంట్లను అలాగే ఉంచి కొత్త కామెంట్లను నిలువరించొచ్చు. కంటెంట్‌ క్రియేటర్లకు వారి కామెంట్‌ సెక్షన్‌లో మరింత నియంత్రణ కల్పించటమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చింది.

ఇప్పటివరకు యూట్యూబ్‌లో వీడియోల కింద చేసే కామెంట్లు కావాలంటే పబ్లిష్‌ చేయవచ్చు. లేదా పూర్తిగా డిజేబుల్‌ చేయొచ్చు. ఒకవేళ కామెంట్ల మధ్యలో ఆపాలంటే పూర్తిగా తీసేయడం ఒక్కటే మార్గం. యూట్యూబ్‌ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ ద్వారా పాత కామెంట్లను అలానే ఉంచుతూ కొత్త కామెంట్లు చేయకుండా నియంత్రించవచ్చు. ఈ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యూట్యూబ్‌ తన బ్లాగ్‌లో తెలిపింది.

Post a Comment

0 Comments